ఢిల్లీ గ్యాంగ్ రేప్ : టాలీవుడ్ ర్యాలీ...(ఫోటోలు)
హైదరాబాద్ : ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై తెలుగు సినీ పరిశ్రమ ఏకమై నిరసన వ్యక్తం చేసింది. మూవీ ఆర్టిస్టులంతా ఏకమై హైదరాబాద్‌లో నిన్న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఫిల్మ్ చాంబర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత రామానాయుడు, జమున, విజయ నిర్మల, గీతాంజలి, మురళీ మోహన్, జయసుద, పరుచూరి బ్రదర్స్, జీవిత రాజశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
స్త్రీలకు రక్షణ కల్పించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, ఢిల్లీ గ్యాంగ్ రేప్ లాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా కఠినమైన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని సాంఘీకంగా బహిష్కరించాలని, మాన భంగానికి మరణశిక్షే సరి లాంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.

ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై టాలీవుడ్ నిరసన ప్రదర్శన

ర్యాలీకి నేతృత్వం వహించిన అక్కినేని నాగేశ్వరరావు

మానవ హారంగా ఏర్పడిన టాలీవుడ్ స్టార్స్..

మానవ హారంగా ఏర్పడిన టాలీవుడ్ స్టార్స్..

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న జమున తదితరులు

నిర్భయ మృతికి నివాళులు అర్పిస్తూ...ప్రతిజ్ఞ చేస్తున్న టాలీవుడ్ ప్రముఖులు

ప్లకార్డులు ప్రదర్శిస్తున్న రామానాయుడు తదితరులు
ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో నిర్భయ అనే పారామెడికల్ స్టూడెంట్ మృతి చెందిన ఘటన దేశం మొత్తాన్ని కలిచి వేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దేశంలోని యువత మొత్తం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వేలసంఖ్యలో విద్యార్థులు పార్లమెంటులో ముట్టడికి ప్రయత్నించి గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి రేప్ కేసుల్లో మరింత కఠిన శిక్షలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











