రేప్‌లు జరుగుతాయి...ఆ సినిమా బ్యాన్ చేయండి!
బెంగుళూరు: ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'హేట్ స్టోరీ 2' విమర్శల వర్షం కురుస్తోంది. కర్నాటక అసెంబ్లీలో జోడీఎస్ ఎమ్మెల్యే ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసారు. ఈ చిత్రం యువతను పక్కదారి పట్టించేలా ఉందని...దీని వల్ల మహిళలపై నేరాలు పెరిగే అవకాశం ఉందని, అత్యాచారాలు జరిగే అవకాశం ఉందని ఆరోపించారు.
సినిమాలోని కొన్ని సన్నివేశాలు అసభ్యంగా ఉన్నాయని, ఈచిత్రాన్ని నిషేదించాలని, మహిళలపై నేరాలు జరిగే అవకాశం ఉన్నందున ఇలాంటి చిత్రాలను అనుమతించ వద్దని జేడీ ఎస్ ఎమ్మెల్యే వైఎస్‌వి దత్తా కోరారు. దీంతో కర్నాటక ప్రభుత్వం ఈచిత్రంపై విచారణకు ఆదేశించింది.

కర్నాటక హోం మినిస్టర్ కె.జె జార్జ్ ఈ సినిమాపై నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించారు. 'హేట్ స్టోరీ 2' చిత్రానికి విశాల్ పాండే దర్శకత్వం వహించారు. జై భానుశాలి, సుర్వీన్ చావ్లా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్లు, పోస్టర్లు అశ్లీల సన్నివేశాలతో కూడి ఉండటంతో ఈ వివాదం తలెత్తింది.
అయితే సినిమాలోని ఓ పాటలో హీరో హీరోయిన్ల మధ్య హాట్ హాట్ ముద్దు సీన్లు, బెడ్రూం సీన్లు ఉన్నాయి. హీరోయిన్‌పై విలన్ దాడి చేసే సీన్లు హింసాత్మకంగా ఉన్నాయి. మిగతా భాగం అంతా రివేంజ్ కథాంశంతో నడుస్తుంది. తన ప్రియుడిని చంపిన విలన్‌పై హీరోయిన్ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనేది సినిమా కథాంశం.


Click it and Unblock the Notifications











