twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దేనికైనా రెడీ' వివాదం...సెన్సార్‌ బోర్డు హామీ

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : మంచు విష్ణు హీరోగా రూపొందిన 'దేనికైనా రెడీ' వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలిగించాలని డిమాండ్‌ చేస్తూ సెన్సార్‌ బోర్డు కార్యాలయం ఎదుట బ్రాహ్మణ సంఘాలు ధర్నాకు దిగాయి. ఆ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే, తప్పక తొలిగిస్తామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. ఇక బ్రహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న దేనికైనారెడి అనే సినిమాలో ఉన్న సన్నివేశాలను, మాటలను వెంటనే తొలగించాలని కోరుతూ పవన్‌కుమార్ అనే వ్యక్తి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో 10వ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు.

    దేనికైనా రెడీ చిత్ర ప్రముఖులపై కేసు నమోదు చేయాలని మల్కాజిగిరి కోర్టు పోలీసులను ఆదేశించింది. చిత్ర నిర్మాత మోహన్‌బాబు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి, నటులు విష్ణు, బ్రహ్మానందంలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. ఈ చిత్రం బ్రాహ్మణులను కించపర్చేవిధంగా ఉందని, పలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

    సర్వజగ్గత్తుకు మూలమైన వేదాన్ని, బ్రహ్మణ కులాన్ని, ఆచారాలను అవమానిస్తూ చిత్రీకరించిన దేనికైనారెఢీ చిత్రాన్ని వెంటనే నిలిపివేయాలని బ్రహ్మణ శ్రీవైష్ణవ సేవా సమితి సభ్యులు కాండూరి నరేంద్రాచ్యార ప్రకటనలో డిమాండ్ చేశారు. వేదం పుట్టిన ఈ భూమి మీదే వేదానికి, బ్రహ్మణోత్తములకు, ఛండీయజ్ఞానికి అవమానం జరగడం విచారకరమన్నారు. దేనికైనారెఢీ చిత్రంలో హిందూమతాన్ని, బ్రహ్మణులను, ఛండీయాగాన్ని కించపరుస్తూ చిత్రీకరించడం దర్శకుడు, నిర్మాత, రచయిత తెలివితక్కువ తనానికి నిదర్శనమన్నారు. యజ్ఞం చేస్తున్న సమయంలో మరో మతస్తుడిని ఆచార్యులుగా చూపించడం, మాసంతో చేసిన హలీంను బ్రహ్మణోత్తములకు తినిపించడం బ్రహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ఛండీయాగంలో మంత్రాలకు బదులుగా బ్రహ్మాణోత్తములచే సినిమా పాటలు పాడించడం వేదాన్ని అవమానించినట్లేనని విచారం వ్యక్తం చేశారు. బ్రహ్మణ మహిళ పాత్రను కూడా చిత్రంలో వ్యాంపు క్యారెక్టర్‌గా చిత్రీకరించి, బ్రహ్మణ మహిళలను కించపరిచారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. దేనికైనారెఢీ చిత్రానికి సెన్సార్‌బోర్డు ఎలా అనుమతి ఇచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేనికైనారెఢీ చిత్రాన్ని నిలిపివేయాలని, నిర్మాత, దర్శకుడు, రచయిత బ్రహ్మణోత్తములకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బహ్మణులందరిని ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

    చిత్ర నిర్మాత మోహన్‌బాబు ఇంటి ముందు ధర్నా నిర్వహించిన బ్రహ్మణులు చందాల కోసం వచ్చినట్లు అభివర్ణించడం మోహన్‌బాబు తె లివితక్కువ తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దేనికైనారెఢీ చిత్రాన్ని నిలిపివేయాలని, నిర్మాత, దర్శకుడు, రచయిత బ్రహ్మణోత్తములకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

    English summary
    Brahmin associations in the city took to the streets to protest against the film Denikaina Ready that resulted in the banning of the film that had portrayed the community in poor light. 
 On Tuesday morning, a group of angry protesters performed pinda pradhanam (final rites) for actor Mohan Babu. They demanded the objectionable scenes in the movie, 'Denikaina Ready' to be removed and warned of intensifying agitation and approach court against the film if the scenes were not removed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X