»   » 'దేనికైనా రెడీ' వివాదంపై కోర్టు తీర్పు ఇచ్చింది

'దేనికైనా రెడీ' వివాదంపై కోర్టు తీర్పు ఇచ్చింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరబాద్ : 'దేనికైనా రెడీ' విషయంలో నెలకొన్న సెన్సారు వివాదం ముగిసింది. గతంలో ఈ సినిమాలోని రెండు సన్నివేశాలను తొలగించాలంటూ కింది న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే హీరో విష్ణు ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేశారు. ఆ రెండు సన్నివేశాల్ని తొలగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

అప్పట్లో ...మంచు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ వివాదం మొదలైంది. దాంతో ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ ని వేసింది. దేనికైనా రెడీ సినిమాలో 20 అభ్యంతరకర సన్నివేశాలను ప్రభుత్వం నియమించిన కమిటీ గుర్తించింది. ఈ రోజు నిర్మాత మోహన్‌బాబును కలిసి ప్రభుత్వ కమిటీ అభిప్రాయం తీసుకుంది. కమిటీని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మోహన్‌బాబు పిటిషన్‌ దాఖలు చేశారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్‌బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో ప్రక్క సెన్సార్ సర్ఠిఫికేట్ రద్దు చేయాలంటూ హై కోర్టులో మరోకేసు మొదలై ఇలా ముగిసింది.

హైదరబాద్ : 'దేనికైనా రెడీ' విషయంలో నెలకొన్న సెన్సారు వివాదం ముగిసింది. గతంలో ఈ సినిమాలోని రెండు సన్నివేశాలను తొలగించాలంటూ కింది న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే హీరో విష్ణు ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేశారు. ఆ రెండు సన్నివేశాల్ని తొలగించాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పట్లో ...మంచు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ' చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ వివాదం మొదలైంది. దాంతో ప్రభుత్వం ఓ ఉన్నతస్థాయి కమిటీ ని వేసింది. దేనికైనా రెడీ సినిమాలో 20 అభ్యంతరకర సన్నివేశాలను ప్రభుత్వం నియమించిన కమిటీ గుర్తించింది. ఈ రోజు నిర్మాత మోహన్‌బాబును కలిసి ప్రభుత్వ కమిటీ అభిప్రాయం తీసుకుంది. కమిటీని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మోహన్‌బాబు పిటిషన్‌ దాఖలు చేశారు. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్‌బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. మరో ప్రక్క సెన్సార్ సర్ఠిఫికేట్ రద్దు చేయాలంటూ హై కోర్టులో మరోకేసు మొదలై ఇలా ముగిసింది. ఇంతకీ సినిమాలో చెప్పబడుతున్న వివాదాస్పద ఆరోపణ సన్నివేశాలు ఇవే.. సినిమాలో హీరో మంచు విష్ణు... సులేమాన్ అనే ముస్లిం(అతని తండ్రి ముస్లిం, తల్లి హిందువు.. ప్రేమ వివాహం) గా కనిపిస్తారు. అతనికి తన తల్లి ప్రేమ వివాహంతో విడిపోయిన మేనమామ కుటుంబాన్ని కలపాలనే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేర్చుకోవటానికి అతనికి కృష్ణ శాస్త్రి అనే తన కాలేజ్ మేట్ తో అవకాసం వస్తుంది. దాంతో సులేమాన్ తన మేనమామ(ప్రభు) ఇంట్లో చండీ యాగం జరిపించటానికి కృష్ణ శాస్త్రి రూపంలో వెళ్తాడు. దాంతో ఓ ముస్లిం... పవిత్రమైన చండీ యాగం చేయించినట్లు అయ్యింది (యజ్ఞం చేస్తున్న సమయంలో మరో మతస్తుడిని ఆచార్యులుగా చూపించడం... ఇది వివాదంలో తొలి అంశం) ఇక హీరో తనకు మంత్రాలు రావు కాబట్టి ఖాళీగా ఉన్న బ్రాహ్మణులు(ధర్మవరపు, మాస్టర్ భరత్ తదితరులు) ని చండీ యాగం కు తీసుకు వెళ్తాడు. అక్కడ తనకు మంత్రాలు రావు కాబట్టి హీరో అందరూ మంత్రాలు చదువుతూంటే... తాను బిజినెస్ మ్యాన్ చిత్రంలో సార్ వస్తారా పాట పాడుతూ కూర్చుంటాడు(ఛండీయాగంలో మంత్రాలకు బదులుగా బ్రహ్మాణోత్తములచే సినిమా పాటలు పాడించడం వేదాన్ని అవమానించినట్లే..ఇది వివాదంలో మరో అంశం). ఇక హీరోకు తోడుగా వెళ్ళిన బ్రాహ్మణుల బ్యాచ్ లో ఉన్న మాస్టర్ భరత్... ప్రక్కింటి లో ఉన్న ముస్లిం అమ్మాయితో చనువుగా ఉండి.. ఆమెకు లైన్ వేస్తూంటాడు. ఆ క్రమంలో ఆమె తినమని హలీం ఇస్తుంది. అది హలీం అని తెలియక.. వెళ్లి తన తోటి బ్రాహ్మణులతో లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. తర్వాత విషయం తెలిసి కక్కుకుంటారు. (మాసంతో చేసిన హలీంను బ్రహ్మణోత్తములకు తినిపించడం బ్రహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయినేది మరో వివాదాంశం).... అయితే సెకండాఫ్ లో ఆమె తాను హలీం ఇవ్వలేదని చెప్పుతుంది. మరో సారి... ఎమ్ ఎస్ నారాయణ పాత్ర(ఇంటి బ్రాహ్మడు పాత్ర)ద్వారా... చికెన్... హీరోతో వచ్చిన బ్రాహ్మణులకు అందుతుంది. వారు ఆ ముక్కలను ఆబగా తినాలని చూడటం మరోసారి చూపెట్టారు. కృష్ణ శాస్త్ర్రి తల్లి (సురేఖా వాణి) పాత్ర ఎవర్ని చూసినా తన భర్త లాగే ఒడ్డూ పొడుగూ ఉన్నారంటూ వెంటబడుతూంటుంది. మొదట బ్రహ్మానందం వెనక, తర్వాత ధర్మవరపుపై ఆమె మోహం చూపినట్లు చూపారు. (బ్రహ్మణ మహిళ పాత్రను కూడా చిత్రంలో వ్యాంపు క్యారెక్టర్‌గా చిత్రీకరించి, బ్రహ్మణ మహిళలను కించపరిచారనేది వివాదం). ఇవీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పబడుతున్న ఆరోపణలకు చెందిన సీన్స్.

ఇంతకీ సినిమాలో చెప్పబడుతున్న వివాదాస్పద ఆరోపణ సన్నివేశాలు ఇవే..

సినిమాలో హీరో మంచు విష్ణు... సులేమాన్ అనే ముస్లిం(అతని తండ్రి ముస్లిం, తల్లి హిందువు.. ప్రేమ వివాహం) గా కనిపిస్తారు. అతనికి తన తల్లి ప్రేమ వివాహంతో విడిపోయిన మేనమామ కుటుంబాన్ని కలపాలనే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేర్చుకోవటానికి అతనికి కృష్ణ శాస్త్రి అనే తన కాలేజ్ మేట్ తో అవకాసం వస్తుంది. దాంతో సులేమాన్ తన మేనమామ(ప్రభు) ఇంట్లో చండీ యాగం జరిపించటానికి కృష్ణ శాస్త్రి రూపంలో వెళ్తాడు. దాంతో ఓ ముస్లిం... పవిత్రమైన చండీ యాగం చేయించినట్లు అయ్యింది (యజ్ఞం చేస్తున్న సమయంలో మరో మతస్తుడిని ఆచార్యులుగా చూపించడం... ఇది వివాదంలో తొలి అంశం)


ఇక హీరో తనకు మంత్రాలు రావు కాబట్టి ఖాళీగా ఉన్న బ్రాహ్మణులు(ధర్మవరపు, మాస్టర్ భరత్ తదితరులు) ని చండీ యాగం కు తీసుకు వెళ్తాడు. అక్కడ తనకు మంత్రాలు రావు కాబట్టి హీరో అందరూ మంత్రాలు చదువుతూంటే... తాను బిజినెస్ మ్యాన్ చిత్రంలో సార్ వస్తారా పాట పాడుతూ కూర్చుంటాడు(ఛండీయాగంలో మంత్రాలకు బదులుగా బ్రహ్మాణోత్తములచే సినిమా పాటలు పాడించడం వేదాన్ని అవమానించినట్లే..ఇది వివాదంలో మరో అంశం).

ఇక హీరోకు తోడుగా వెళ్ళిన బ్రాహ్మణుల బ్యాచ్ లో ఉన్న మాస్టర్ భరత్... ప్రక్కింటి లో ఉన్న ముస్లిం అమ్మాయితో చనువుగా ఉండి.. ఆమెకు లైన్ వేస్తూంటాడు. ఆ క్రమంలో ఆమె తినమని హలీం ఇస్తుంది. అది హలీం అని తెలియక.. వెళ్లి తన తోటి బ్రాహ్మణులతో లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. తర్వాత విషయం తెలిసి కక్కుకుంటారు. (మాసంతో చేసిన హలీంను బ్రహ్మణోత్తములకు తినిపించడం బ్రహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయినేది మరో వివాదాంశం).... అయితే సెకండాఫ్ లో ఆమె తాను హలీం ఇవ్వలేదని చెప్పుతుంది.

మరో సారి... ఎమ్ ఎస్ నారాయణ పాత్ర(ఇంటి బ్రాహ్మడు పాత్ర)ద్వారా... చికెన్... హీరోతో వచ్చిన బ్రాహ్మణులకు అందుతుంది. వారు ఆ ముక్కలను ఆబగా తినాలని చూడటం మరోసారి చూపెట్టారు. కృష్ణ శాస్త్ర్రి తల్లి (సురేఖా వాణి) పాత్ర ఎవర్ని చూసినా తన భర్త లాగే ఒడ్డూ పొడుగూ ఉన్నారంటూ వెంటబడుతూంటుంది. మొదట బ్రహ్మానందం వెనక, తర్వాత ధర్మవరపుపై ఆమె మోహం చూపినట్లు చూపారు. (బ్రహ్మణ మహిళ పాత్రను కూడా చిత్రంలో వ్యాంపు క్యారెక్టర్‌గా చిత్రీకరించి, బ్రహ్మణ మహిళలను కించపరిచారనేది వివాదం). ఇవీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పబడుతున్న ఆరోపణలకు చెందిన సీన్స్.

English summary
The producers of highly controversial film of 2012 'Denikaina Ready' have won the court case against them filed by several Brahmin associations alleging that the film has degraded their caste and hence cut the portions of the film. In a recent judgment given by the High Court, the court opined that there was no need for such censoring of the film. In any case, the film has been screened all over and ran successfully, reducing the significance of the judgment that is so delayed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu