Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వర్మ 'డిపార్టమెంట్' తెలుగు వెర్షన్ వివరాలు
వర్మ 'డిపార్టమెంట్' రేపు(శుక్రవారం)విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో విడుదల అవుతున్న ఈ చిత్రానికి త్వరలో తెలుగు వెర్షన్ కూడా రెడీ చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పలరాజు, దొంగల ముఠా, బెజవాడ చిత్రాలు వరసగా వర్మతో నిర్మించిన కిరణ్ కుమార్ కోనేరు ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. తెలుగు వెర్షన్ కి డైలాగులు శశాంక్ వెన్నెలకంటి రాస్తూండగా, పాటలు సిరాశ్రీ రాస్తున్నారు.
తెలుగునుంచి దగ్గుపాటి రాణా, మంచు లక్ష్మి ప్రసన్న,మధుషాలిని,అంజనా సుఖాని వంటివారు నటించటంతో ఇక్కడ కూడా క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అయితే తెలుగు రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మాత్రం ప్రకటించలేదు. ఇక హిందీ వర్షన్ ని ఆల్ ఓవర్ ఆంధ్రాలో విడుదల చేస్తున్నారు. అయితే ఆంధ్రా, సీడెడ్ లలో కొన్ని ఎంపిక చేసిన స్క్రీన్స్ లో మాత్రమే ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. నైజాంలోనూ,ఆంధ్రా,సీడెడ్ మల్టి ప్లెక్స్ లలో రెగ్యులర్ సినిమాల మాదిరిగా ఎక్కువ ప్రింట్స్ తో విడుదల అవుతుంది.
ఇక డిపార్టమెంట్ చిత్రం పోలీస్ వ్యవస్దకి,అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్ మధ్యన ఉండే సంభందాలని ముఖ్య కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది. దీంట్లో అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను పోషిస్తున్నాడు. సంజయ్ దత్ అండర్ వరల్డ్ ని సమూలనంగా నాశనం చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్ వేస్తున్నారు. అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు. విజయ్ రాజ్ పరారీలో ఉన్న ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు. వీళ్లు కాకుండా తెలుగులోని దగ్గుపాటి రాణా,లక్ష్మి మంచు,మధు షాలని కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు.
రాణా దగ్గుపాటి ఒక పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. లక్ష్మిమంచు సంజయ్ దత్ భార్య పాత్రని పోషిస్తోంది. మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ లో ముగించినా రీసెంట్ గా మళ్లీ క్లైమాక్స్ రీషూట్ చేసారు. బిజినెస్ క్రేజ్ కోసం బ్రెజిల్ మోడిల్ నధాలియాతో ఐటం సాంగ్ చేయించారు. చిత్రంలో మధుశాలిని పాత్ర సినిమాకి హైలెట్ కానుందని చెప్తున్నారు. ఆమె సినిమా అంతా పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది. ఆమె ఇంతకాలం సాఫ్ట్ రోల్ లో కనిపించింది. ఇప్పుడు చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో అదరకొట్టనుందని,ఆమె పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు.