మాస్ ఎంటర్‌టైనర్ అంటున్న వర్మ
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బాలీవుడ్లో 'డిపార్ట్‌మెంట్' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...ఈ చిత్రం తన గత సూపర్ హిట్ చిత్రాలు 'సత్యా', 'కంపెనీ' చిత్రాల కంటే భిన్నంగా ఉంటుందని, వాటి కంటే మోర్ మాస్ ఎంటర్ టైనర్‌గా అలరిస్తుందని చెప్పుకొచ్చారు. 'డిపార్ట్ మెంట్' అనేది కేవలం గ్యాంగ్ స్టర్ల నేపథ్యం మాత్రమే కాదని, పోలీస్ డిపార్ట్ మెంటులో కూడా గ్యాంగ్ స్టర్లు ఉంటారనే కథాంశంతో ఈచిత్రాన్ని రూపొందించినట్లు వర్మ తెలిపారు.
డిపార్ట్‌మెంట్ చిత్రం మే 18న విడుదల అవుతోంది. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటి ఈచిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు యాక్టర్స్ మంచు లక్ష్మి ప్రసన్న, మధు శాలిని కూడా ఇందులో నటిస్తున్నారు. లక్ష్మి ప్రసన్న సంజయ్ దత్ భార్య పాత్రలో, మధు శాలిని లేడీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుంది.
బ్రెజిల్ భామ నథాలియా కౌర్ ఈ చిత్రంలో 'డన్ డన్ చీని' సాంగులో అదగొట్టింది. ఇటీవల విడుదలైన ఈ సాంగులో ఆమె సెక్స్ అప్పీల్ అదిరిందని అంటున్నారంతా. పవర్ ఫుల్ యాక్షన్‌కు తోడు నథాలియా అందాల విందు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచుతోంది.
ఈచిత్రానికి సంగీతం : బప్పీ లహరి, ధరమ్ సందీప్, విక్రమ్ మాగి, ఎడిటింగ్ : వినయ్ అభిజిత్, సినిమాటోగ్రఫీ : అరుణ్ కుమార్, కథ : నిలేష్ గిర్ కర్, నిర్మాతలు : సిద్ధాంత్ ఒబెరాయ్, అమిత్ శర్మ, దర్శకత్ం : రామ్ గోపాల్ వర్మ


Click it and Unblock the Notifications











