twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లకు కొత్త రూల్స్.. ఇవన్నీ ఒకే అయితేనే సరే.. లేకుంటే ఇబ్బందే!

    |

    సాధారణంగా తెలుగు సినిమా అనే కాదు అన్ని భాషలలోనూ చైల్డ్ ఆర్టిస్టులు చాలా కామన్ గా కనపడుతూ ఉంటారు. కొన్ని సినిమాల్లో అయితే కీలక పాత్రధారులుగా చైల్డ్ ఆర్టిస్ట్ లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంత ఎందుకు మొన్నటికి మొన్న బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాలో కూడా బేబీ ధీష్ణ సినిమాను మలుపు తిప్పే పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ల విషయంలో తెలంగాణ కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ కార్మిక శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళితే

    కీలక ఆదేశాలు జారీ

    కీలక ఆదేశాలు జారీ

    సాధారణంగా బాల కార్మికులు అంటే 7, 8 ఏళ్ల వయసులో ఉన్నవారు అని భ్రమపడుతూ ఉంటాము కానీ 18 సంవత్సరాల లోపు వాళ్ళు అందరూ బాల కార్మికుల లెక్కలోకే వస్తారు. అయితే సినిమాల్లో వాళ్ళు నటిస్తుంటే ఇప్పటి దాకా పెద్దగా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి కాదు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా తెలంగాణ కార్మిక శాఖ రంగంలోకి దిగి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఏ రంగాల్లో పని చేయకూడదు అంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

    అనుమతి పత్రం

    అనుమతి పత్రం

    అయితే ఒకవేళ సినిమాలో నటించాలి అని ఆసక్తి ఉన్న బాల నటులు అదేనండీ చైల్డ్ ఆర్టిస్ట్స్ ఎవరైనా ఉంటే? వాళ్ళకి సినిమా అవకాశాలు కనుక దక్కితే ఆ చైల్డ్ ఆర్టిస్టులు సినిమాలో నటించాలి అంటే కలెక్టర్ నుంచి తప్పనిసరిగా అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది.. ఈ సినిమా నిర్మాత కానీ దర్శకుడు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు జిల్లా కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు సినిమాల్లో కనిపించే బాలనటులు అందరికీ ఈ రూల్స్ ఇకమీదట వర్తించబోతున్నాయి.

    ఉత్తర్వులు జారీ

    ఉత్తర్వులు జారీ

    ఈ మేరకు తెలంగాణలో ఉన్న 33 జిల్లాల కలెక్టర్లకు తెలంగాణ కార్మిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమ సినిమాలో ఫలానా బాల నటుడు నటిస్తాడు అని దర్శక నిర్మాతలు ఎవరో ఒకరు కలెక్టర్ కు సమాచారం ఇవ్వడమే కాక సంబంధిత చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో నటించడం తనకు ఇష్టమైన అనే విషయాన్ని కలెక్టర్ ముందు రూఢీ చేయాల్సి ఉంటుంది.. అంతే కాక మరి కొన్ని రూల్స్ కూడా ఈ విషయంలో విధించారు.

     ఇరవై ఐదు శాతం పేమెంట్

    ఇరవై ఐదు శాతం పేమెంట్

    అందులో ముఖ్యమైన రూల్స్ ఏమిటంటే సదరు చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇచ్చే పేమెంట్ లో ఒక ఇరవై ఐదు శాతం పేమెంట్ ఒక జాతీయ బ్యాంకులో ముందు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన డబ్బు సదరు ఆర్టిస్ట్ గార్డియన్స్ కు అంద జేయాల్సి ఉంటుంది. మరో కీలకమైన అంశం ఏమిటంటే వారి చదువుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్ లేని సమయంలో షూటింగ్ పెట్టుకో ఇవ్వాల్సి ఉంటుంది అని, చదువు మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదని కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

    English summary
    Department of Labor imposes new regulations for the film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X