పూరీ-అల్లు దేశముదురు డిసెంబర్ 22న...
పోకిరి సూపర్‌హిట్ అయిన తర్వాత అదే శైలిలో అల్లు అర్జున్‌తో పూరీ జగన్నాధ్ దేశముదురు సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. జులై 28 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. పక్కా ప్రణాళికతో ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా తెలుగు తెరకు కొత్త అయిన హంసికా మోత్వానీని దర్శకుడు పూరీ ఎంపిక చేశారు. చక్రి సంగీతం సమకూర్చనున్నారు. యూనివర్సల్ మీడియా పతాకంపై భగవాన్, దానయ్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications