twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోలీసుల కోరికపైనే సినిమాపై నిషేధం

    By Staff
    |

    Deshdrohi
    కమాల్ ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న"దేశద్రోహి' చిత్రం విడుదలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. . ఉత్తరాది ప్రజలు, మహారాష్ట్ర వాసుల మధ్య ఘర్షణలు ఇతివృత్తంగా రూపుదిద్దుకొన్నఈ చిత్రం శుక్రవారం(నవంబరు 14) విడుదలకావాల్సి ఉంది. అయితే ఇటీవల ఉత్తరాదివారిపై ఎంఎన్ఎస్ దాడులకు సంబంధించిన ప్రస్తావన ఈ చిత్రంలో ఉండడంతో దీనిపై నిషేధం విధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉండడంతో ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించాల్సిందిగా ముంబయి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేశారు.

    ఈ చిత్రం విడుదలను రాజ్‌థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ సైతం వ్యతిరేకిస్తూ వచ్చింది. ఈ చిత్రం ప్రివ్యూను తిలకించిన ఎంఎన్ఎస్ పార్టీ బృందం...చిత్రంలోని పలు సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తంచేసింది. గత నవంబరు నెలాఖరులో పోలీసు సీనియర్ అధికారుల బృందం సైతం ఈ చిత్రాన్ని తిలకించింది. శాంతి భద్రతల సమస్య ఏర్పరచే ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధం విధించాలని శివసేన నాయకులు సైతం డిమాండు చేస్తూ వచ్చారు.

    తాజాగా చిత్రం విడుదలపై నిషేధం విదిస్తూ ఆ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడం పట్ల దర్శకుడు కమాల్ ఖాన్ తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టంచేశారు. సమస్యాత్మకం అనుకుంటే ఏ సన్నివేశం, డైలాగునైనా తొలగించేందుకు తాను సిద్ధమని స్పష్టంచేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X