twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిల్‌ వివాదంపై పోలీస్ కేసు.. కోర్టులో పిటిషన్

    By Srikanya
    |

    ఆ మధ్యన టైటిల్ వివాదాలు తెలుగు చిత్ర పరిశ్రమని ఊపేసాయి. ఖలేజా టైటిల్ నాదేనంటూ ఒకరు,కత్తి టైటిల్ నాదేనంటూ గుణశేఖర్ ఇలా రోజుకో టైటిల్ వివాదం చెలరేగింది.అయితే ఇప్పుడా అలాంటి వివాదాలు బాలీవుడ్ లో మొదలయ్యాయి. తాజాగా రోహిత్ ధావన్ నిర్మించిన దేశీబాయ్స్ చిత్రం వివాదంలో చిక్కుకుంది.

    వాస్తవానికి ఈ టైటిల్‌ను తాను నమోదు చేసుకున్నానంటూ లాతూర్ పట్టణానికి చెందిన స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు శ్యామ్ దేవ్‌కత్తే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. 2009, సెప్టెం బర్‌లోనే టైటిల్ నమోదు జరిగిందని తన పిటిషన్‌లో శ్యామ్ పేర్కొన్నారు. ఈ టైటిల్‌తో రోహిత్ ధావన్ అసోసియేట్స్‌ను క లుసుకున్నానని తెలిపారు. అయితే ఇటీవల ఇదే ప్రోమోను టీవీల్లో చూశానని ఆరోపించారు. వెంటనే ఈ విషయమై రోహిత్‌తో ఫోన్‌లో సంభాషించేందుకు ప్రయత్నించగా నోటికొచ్చినట్టు తిట్టాడన్నారు.

    ఈ విషయమై ఈ నెల 14వ తేదీన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానన్నారు. కాపీరైట్ చట్టం కింద రోహిత్‌తోపాటు మరికొంతమందిపై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదుకూడా చేశానన్నారు. అయినప్పటికీ ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఇక్కడకు రావాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ దేశీబాయ్స్ చిత్రంలో అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం,దీపికా పదుకోని,చిత్రాంగద సింగ్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.దర్శకుడు రోహిత్ ధావన్ కిదే తొలి చిత్రం.రోహిత్ ధావన్ మరెవరో కాదు గతంలో ఎన్నో కామిడీ చిత్రాలు డైరక్ట్ చేసిన డేవిడ్ ధావన్ తనయడు. ఈ చిత్రం కూడా ఓ యాక్షన్ కామిడినే కావటం విశేషం.

    English summary
    A Latur-based script writer and director Shyam Devkatte filed a petition against Rohit Dhawan’s (David Dhawan’s son) directorial debut Desi Boyz alleging that he had registered the film titled Desi Boys with the Film Writers’ Association (FWA) in September 2009.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X