ఆర్తి కూడా సత్యకృష్ణన్ లా అవుతుందా???
వివాహానంతరం అమెరికా వెళ్లిపోయి, ఈ మధ్యనే తిరిగొచ్చి తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆర్తి అగర్వాల్ వచ్చిన ప్రతి సినిమానీ అంగీకరిస్తోంది. నీలవేణి, జెంటిల్ మెన్ సినిమాలతో పాటు కమేడియన్ ధర్మవరపు సుబ్రమణ్యం హీరోగా రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి అగ్రకథానాయకులతో నటించిన ఆర్తి నిరాశతో వచ్చిన ప్రతి సినిమానీ అంగీకరిస్తోందని ఫిలింనగర్ సమాచారం.
దీనికి తోడు ఆర్తికి "మెంటల్ కృష్ణ" పోసాని కృష్ణ మురళి అండదండలు మెండుగా వున్నట్టు సమాచారం. 'ఇంట్లో అన్నం వండనమ్మ, పక్కింట్లో బిర్యాని వండుతానన్నట్టు' తనకే సినిమాలు లేక సతమతమౌతున్న పోసాని ఆర్తికి ఎంత వరకూ సాయపడతారో చూడాలి. మెంటల్ కృష్ణ సినిమాకు ముందు అక్క, వదిన లాంటి క్యారెక్టర్స్ తో బజీగా వున్న సత్యా కృష్ణన్, ఆ తర్వాత అవకాశాల్లేక కనుమరుగైపోయింది. ఆర్తికి కూడా అదే గతి పడుతుందన్న వార్త ఫిలింనగర్ లో హాటా టాపిక్......


Click it and Unblock the Notifications