»   »  వేదికపై నాగ్ డాన్స్: అలీ పాడిన ఫన్నీ సాంగ్ (మేకింగ్ వీడియో)

వేదికపై నాగ్ డాన్స్: అలీ పాడిన ఫన్నీ సాంగ్ (మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, సామ్ హీరోహీరోయిన్లుగా చునియా ద‌ర్శ‌క‌త్వంలో అయాన్ ప్రొడ‌క్ష‌న్స్ రూపొందుతోన్న చిత్రం ‘ప‌డేసావే'. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఆడియో జనవరి 26 సందర్భంగా విడుదల చేసారు. నాగార్జున, కె రాఘవేంద్రరావు, ప్రకాష్ రాజ్, రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, నాగ సుశీల, బి గోపాల్, సీనియర్ నరేష్, కళ్యాన్ కృష్ణ, లావణ్య త్రిపాఠి, బి.జయ, ఎస్.గోపాల్ రెడ్డి, శ్యామ్.కె.నాయుడు, సుశాంత్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ఆడియో వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...చునియా దర్శకురాలు కావడం ఆనందంగా ఉంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్, సినిమా పిక్చరైజేషన్ చాలా బావుంది. ఈ సినిమా మగవాళ్లు ముఖ్యంగా చూడాల్సిన సినిమా. ఆడవాళ్లను మగశాళ్లు ఎలా పడేయాలో ఈ సినిమాలో చునియా క్లియర్ గా చెప్పింది. ఆడవాళ్లు వాళ్లకు కావాల్సిన, హస్పెంబ్ నుండి, బాయ్ ఫ్రెండ్ నుండి ఏం కోరుకుంటున్నారో క్లియర్ గా తెలుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున స్టేజీపై స్టెప్పులేసారు.

ఈ చిత్రంలో కమెడియన్ అలీ నటించడంతో పాటో పాటు ఓ పాట కూడా పాడారు. ఆ పాట గురించి డైరెక్టర్ చునియా మాట్లాడుతూ ‘టిపికల్ సిచ్యువేషనల్ సాంగ్. ఈ సిచ్యువేషన్ తెలియగానే అనూప్ అలీతో పాడించాడు. ఫన్నీగా, కామెడి సెన్స్ తో సాగే పాట ఇది. బాగా వచ్చింది' అన్నారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ ‘కామిక్ సిచ్యువేషన్ లో వచ్చే పాట ఇది. ఆలీ నటించడమే కాకుండా పాటను చాలా బాగా పాడారు.' అన్నారు.

హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘హిలేరియస్ సాంగ్, బాగా వచ్చింది. మంచి మ్యూజిక్ కుదిరింది. చునియాగారు బాగా పిక్చరైజ్ చేశారు. అలీ గారికి థాంక్స్'' అన్నారు. నిత్యాశెట్టి మాట్లాడుతూ ‘'మంచి కామెడి సాంగ్. చునియాగారికి, అలీ గారికి థాంక్స్. అనూప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. '' అన్నారు.

పడేసావె మూవీ ఆడియో రిలీజ్ ఫోటోస్, అలీ పాడిన మేకింగ్ వీడియో స్లైడ్ షోలో....

ఆడియో రిలీజ్

ఆడియో రిలీజ్


పడేసావే మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో మంగళవారం జరిగింది.

అలీ..

అలీ..


తను పాడిన ఫన్నీ సాంగ్ గురించి మాట్లాడుతున్న అలీ

నాగార్జున డాన్స్

నాగార్జున డాన్స్


పడేసావే ఆడియో వేడుకలో నాగార్జున డాన్స్ చేసారు.

rn

అలీ పాడిన పాట మేకింగ్ వీడియో


అలీ పాడిన పాట మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.

English summary
Watch & Enjoy Despo Song Making from Padesave Movie, Starring Karthik, Raju, Nithya Shetty.Music composed by Anup Rubens,Directed by Chunia and Produced by Sabiha Sultana under the Banner of Ayaan Creations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu