»   » అసలు నిజం: ప్రియమణి బోయ్ ఫ్రెండ్ ని ఎందుకు దాచింది..అతనేం చేస్తున్నాడు

అసలు నిజం: ప్రియమణి బోయ్ ఫ్రెండ్ ని ఎందుకు దాచింది..అతనేం చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చాలా కాలం నుంచి ప్రియమణి ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతనెవరు అనేది మాత్రం ఇంతకాలం రివీల్ కాలేదు. దానికి తోడు ఆమె తరుచుగా బ్యాంకాక్, టర్కీ వంటి ప్రాంతాల్లో వేరే వేరే ఫ్రెండ్స్ తో కనపడుతూ ఉంది. ఇదంతా చూస్తున్న మీడియా...ప్రియమణి పర్శనల్ లైఫ్ లో ఏదో జరుగుతోంది...అని అనుమానించింది. ఆ అనుమానం నిజమైంది. ఆమె కో బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసింది. అతని ఫొటో ఇదిగో..ఇక్కడ మీరు చూస్తున్నదే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ ఫొటో లో ప్రియమణితో పాటు ఉన్న వ్యక్తి పేరు ముస్తాఫా రాజ్. అతనో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ ఓనర్. ముంబైలో అతను ఈవెంట్స్ చేస్తూంటాడు. ఈ విషయమై ప్రియమణి చాలా కాలంగా దాస్తూ వచ్చింది.

Details about Priyamani's Boy Friend Mustafa Raj

అయితే రీసెంట్ గా ప్రియమణి మాట్లాడుతూ... నేను ఇంతకాలం నా ప్రేమ విషయం చెప్పలేకపోవటానికి కారణం మరేదో కాదు..ముస్తాఫా కాస్త సిగ్గరి అంతే. అతని వద్ద నుంచి ఫర్మిషన్ తీసుకున్న తర్వాతే మీకు విషయం చెప్తున్నాను ', అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. ఈ విషయమై మరికొద్దిరోజుల్లో మీడియాతో ఓపెన్ గా చెప్తుందని అంతా భావిస్తున్నారు. అంతేకాదు అతనితో వివాహం మరికొద్దిరోజుల్లో జరగనుందని చెప్తున్నారు.

ఆ మధ్యన కన్నడ నటుడు కుమార్ గోవింద్‌తో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్టు వినిపించింది. ఆ నటుడు కూడా ప్రియమణితో తాను సన్నిహితంగా వున్న ఫోటోలను ట్విట్టెర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చాలా విలువైనవనీ, దాచుకుంటాననీ అన్నాడు. కానీ ఈ ప్రియుడు విషయం తేలిపోవటంతో ఈ ప్రేమాయణం గాసిప్ కు ఫుల్ స్టాప్ పడ్డట్టే.

ఇక ప్రియమణి.....తమిళ చిత్రం పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.తెలుగు,తమిళ,కన్నడ,మళయాళ భాషలలో దాదాపు 20 చిత్రాలలో నటించింది. రావణ్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగు పెట్టింది.

English summary
Talented actress Priyamani is said to be in love with Mustafa Raj, an Event Management company owner from Mumbai from last for years. 'I've not revealed about love all these days because Mustafa is a shy person. After taking consent from him, now I spilled the beans', says Priyamani.
Please Wait while comments are loading...