సాయిధరమ్‌తేజ్‌ ఎంట్రీ వెనుక... (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్‌: చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రేయ్‌'. సయామీఖేర్‌ హీరోయిన్. శ్రద్ధాదాస్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. 2010లో ప్రారంభమైన ఈ చిత్రం అనివార్యమైన కారణాలతో ఆలస్యంగా చిత్రీకరణ పూర్తిచేసుకుని..నాలుగేళ్లకు మన ముందుకు వస్తోంది.

'రేయ్‌' సినిమా పాటలు విడుదల అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ఈ ఆడియో పంక్షన్ కి పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేయటం అందరి దృష్టినీ ఈ చిత్రం ఆకర్షిస్తోంది. మరో ప్రక్క మరో మెగా హీరో రావటంతో ఎలా ఉంటాడు..ఎలా నటిస్తాడు...తెలుగు తెరపై నిలబడతాడా...వంటి ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో కలుగుతున్నాయి.

చిత్రం దాదాపు నాలుగేళ్లు లేటు అయినా ఈ చిత్రంపై ఎక్కడా అంచనాలు తగ్గలేదు. అది వైవియస్ చౌదరి ప్రతిభపై ఉన్న నమ్మకం కావచ్చు. మెగా క్యాంప్ పై ఉన్న అభిమానం కావచ్చు. ఈ నేపధ్యంలో

రేయ్‌ విశేషాలు మీకోసం.... స్లైడ్ షో లో

చాలా టైం...

చాలా టైం...

2009లో రేయ్‌ చిత్ర హీరోగా సాయిధరమ్‌తేజ్‌ ఎంపికయ్యాడు. అయితే అనుకున్న వెంటనే పని మొదలు కాలేదు. ఇంతకాలానికి ప్రేక్షకులు ముందుకు రావటానికి టైం పట్టింది.

లొకేషన్స్..

లొకేషన్స్..

2010 మే, జూన్‌లలో షూటింగ్‌ లొకేషన్ల కోసం దర్శకుడు వైవిఎస్‌ చౌదరి అమెరికా, వెస్టిండీస్‌లలో స్కౌటింగ్‌ నిర్వహించారు.

ప్రారంభం...

ప్రారంభం...

2010 అక్టోబరు 17న చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. నందమూరి హరికృష్ణ పూజాకార్యక్రమంలో పాల్గొని షూటింగ్‌ ప్రారంభించారు.

ప్రారంభానికి...

ప్రారంభానికి...

పవన్‌కల్యాణ్‌ క్లాప్‌ను దర్శకుడు వైవిఎస్‌ చౌదరికి అందించగా అల్లు అరవింద్‌, నాగబాబు స్ట్రిప్టు అందిచారు. అక్కినేని నాగేశ్వర్రావు హీరోహీరోయిన్లపై క్లాప్‌ కొట్టారు.

రామ్ చరణ్ కి అనుకున్నా...

రామ్ చరణ్ కి అనుకున్నా...


ఈ కథను చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ తొలిచిత్రానికి అనుకున్నప్పటికీ, చిరంజీవి మేనల్లుడికి అవకాశం దక్కింది.

స్పెషల్ గా...

స్పెషల్ గా...

క్త్లెమాక్స్‌ సాంగ్‌ లొకేషన్‌కి నాగబాబు, అల్లు అర్జున్‌ వచ్చి సందడి చేశారు. సాంగ్‌ చిత్రీకరణ చూసిన నాగబాబు యూనిట్‌ను యూనిట్‌ను అభినందించారు.

ఇదో హైలెట్...

ఇదో హైలెట్...

అల్లు అర్జున్‌ సింగిల్‌ షాట్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఓరోజు 'ఇద్దరమ్మాయిలతో', 'రేయ్‌' షూటింగులు ఒకే చోట జరుగుతున్నాయి. 'రేయ్‌'కోసం ఓ పాట తెరకెక్కిస్తున్నాం. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే పాట అది. ఆ పాట నిడివి ఎనిమిది నిమిషాలకు పైనే. ఈ పాట కోసం దాదాపు 33 రోజులు శ్రమించాం. అందులోని ఓ కీలకమైన షాట్‌ని బన్నీ చేతుల మీదుగా తెరకెక్కించాం. ఆ ప్రభావమో ఏమో.. అల్లు అర్జున్‌ ఎనర్జీ ఆ పాటలోనూ కనిపిస్తుంది'' అని వైవియస్ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ ఏమన్నారు...

పవన్ కళ్యాణ్ ఏమన్నారు...

''ఎవరు ఏం సాధించాలన్నా వారి మనసులో దృఢమైన సంకల్పం ఉండాలి. నటన అంటే వారసత్వమో లేక కుటుంబం నుంచి వచ్చే సంపదో కాదు. సాయిధరమ్‌తేజ్‌ సినిమాల్లోకి వస్తానన్నప్పుడు వాడికి నేను ఈ మాటలే చెప్పాను. అభిమానాన్ని, ప్రేమని కొనలేము. మనలో నిజాయితీ ఉండాలి. అప్పుడే ఈ రెండూ లభిస్తాయి. దీంతో పాటు విజయం కూడా లభిస్తుంది. సాయి కోసం నేనేమీ చేయలేదు. నాకు తెలిసిన గురువు దగ్గరకు మాత్రమే పంపించాను'' అన్నారు పవన్‌ కల్యాణ్‌.

సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ...

సాయిధరమ్‌తేజ్‌ మాట్లాడుతూ...

''పవన్‌ కల్యాణ్‌ మావయ్య ఇచ్చిన ప్రోత్సాహమే ఈ సినిమా. చిరు మావయ్య నుంచి పట్టుదల, కృషి, నాగబాబు నుంచి నిదానం, నవ్వు, కల్యాణ్‌ నుంచి క్రమశిక్షణ, నిబద్ధతల్ని నేర్చుకున్నాను. వాళ్ల చేతుల్లో పెరిగాను నేను. ఎవరినీ నిరాశపరచను''అన్నారు.

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ...

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ...

''నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. నా తొలి చిత్రాన్ని ఆయనతోనే చేయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. నేను ఏ కొత్త హీరోని తెరకు పరిచయం చేసినా... ఆ హీరోలో పవన్‌ కల్యాణ్‌ కనబడతారు. సాయిధరమ్‌ తేజ్‌ చాలా బాగా నటించాడు. తనలో చిరంజీవి, నాగబాబు, పవన్‌ కల్యాణ్‌ ముగ్గురూ కనిపిస్తారు. '' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X