Silk Smitha: మార్క్ ఆంటోనిలో 'సిల్క్ స్మిత'.. అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

విశాల్, ఎస్ జే సూర్య నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో దివంగత నటి సిల్క్ స్మిత క్యారెక్టర్ లో ఓ అమ్మాయి కనిపించింది. ఇక ఆమె అచ్చం సిల్క్ స్మితలాగే కనిపించింది. అసలు ఆ అమ్మాయి ఎవరూ... సిల్క్ స్మితలా ఎలా తయారు చేశారు.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ వారం వచ్చిన సినిమాల్లో తమిళ డబ్బింగ్ సినిమా మార్క్ ఆంటోనీ. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సెప్టెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది.

Details of Vishnu Priya Gandhi who played the role of Silk Smitha in Vishals Mark Antony Movie

ఇక మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. హీరోగా విశాల్, విలన్ గా ఎస్ జే సూర్య నటన అద్భతమని అంటున్నారు. ఇక హీరోయిన్ గా రీతూ వర్మ నటించింది. సెల్వ రాఘవన్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. మినీ స్టూడియో బ్యానర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.

మార్క్ ఆంటోనీ చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ సొంతం చేసుకుంది. పోస్ట‌ర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. ప్ర‌చార కార్య‌క్ర‌మాల ద్వారా సినిమాపై మ‌రింత హైప్ పెంచారు. గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న విశాల్‌.. ఈ మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని ఆశ‌ప‌డ్డారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

Details of Vishnu Priya Gandhi who played the role of Silk Smitha in Vishals Mark Antony Movie

అయితే మార్క్ అంటోనీ సినిమాలో సిల్క్ స్మితలా ఓ అమ్మాయి కనిపించింది. మూవీలో ఆమెను చూడ‌గానే అంద‌రూ ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత మెయిన్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. అయితే సిల్క్ స్మితను కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా ఈ సినిమాలో రీక్రియేట్ చేశారా అని అంతా అనుకున్నారు. కానీ, అది నిజం కాదని తెలుస్తోంది.

ఇక అచ్చం సిల్క్ పోలికలతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకు వచ్చి ఆ పాత్రని చేయించారని తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరు విష్ణు ప్రియ గాంధీ. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. సిల్క్ స్మిత పోలిక‌లు ఉండ‌టంతో.. ఆమె హావ భావాలు, డ్రెస్సింగ్ స్టైల్ ను విష్ణు ప్రియ‌ మెయింటైన్ చేయ‌డం స్టార్ట్ చేసింది. దాంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇన్ స్టాగ్రామ్ లో విష్ణు ప్రియ‌కు దాదాపుగా 3 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

Details of Vishnu Priya Gandhi who played the role of Silk Smitha in Vishals Mark Antony Movie

విష్ణు ప్రియ‌ను వారంతా జూనియర్ సిల్క్ స్మిత అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ఇటీవ‌ల ఈమె కొన్ని పాపుల‌ర్ యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చింది. వీటిని చూసిన విశాల్‌.. డైరెక్ట‌ర్ కు చెప్పి స్వ‌యంగా ఆమెను మార్క్ ఆంటోని మూవీకి ఎంపిక చేయించాడు. అలా ఈ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X