'ఆటోనగర్ సూర్య' కాన్సెప్టు ఏమిటి
నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'. ఆ చిత్రంలో నాగచైతన్య టైటిల్ రోల్ లో సూర్య పాత్రలో కనపించనున్నారు. ఆ చిత్రం గురించి చెపుతూ దర్సకుడు దేవకట్టా...ఆ వూరికి వెళ్లి సూర్య పేరు చెబితే చాలు... ఆ ఆటోనగర్ సూర్యేనా? అంటూ మొదలుపెడతారు. ఆటోనగర్ ఎంత ఫేమసో... అక్కడుండే సూర్యకి కూడా అంతే పేరు మరి. నలుగురి కష్టసుఖాల గురించి ఆలోచించే ఆ యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెరపైనే చూడాలన్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'ఆటోనగర్ సూర్య'లో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు. మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. నృత్య దర్శకుడు రాజుసుందరం నేతృత్వంలో నాగచైతన్య-సమంతపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''వినోదం, మాస్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది.
ఆటోనగర్ అడ్డాగా చేసుకొన్న ఓ యువకుడు సాధించిందేమిటో తెరపైనే చూడాలి. నాగచైతన్యని ఒక కొత్త కోణంలో తెరపై ఆవిష్కరిస్తున్నాం. అనూప్ చక్కటి పాటలు సమకూర్చారు. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించే చిత్రమవుతుందని అన్నారు. సాయికుమార్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.


Click it and Unblock the Notifications











