'ఆటో నగర్ సూర్య' విడుదల పై దేవకట్టా...
హైదరాబాద్: నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'ఆటో నగర్ సూర్య'. దేవాకట్టా దర్శకత్వం వహించారు. మరో 20 శాతం చిత్రీకరణ మిగిలి ఉండగా ఈ సినిమా ఆగిపోయింది. దాదాపు యేడాది పాటు... ఈ సినిమాని ఎవరూ ముందుకు కదల్చలేదు. 'తడాఖా' హిట్ తరవాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. మిగిలిన చిత్రీకరణ పూర్తిచేసి ఇప్పుడు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల విషయమై దర్శకుడు దేవకట్టా క్లారిటీ ఇచ్చారు.
దేవకట్టా ట్వీట్ చేస్తూ... " ఆటోన గర్ సూర్య, రీరికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది.... జనవరి నెలాఖరుకు విడుదలకు ప్లాన్ చేస్తున్నాం..ఆడియోని సంక్రాంతి తర్వాత విడుదల చేస్తాం " అన్నారు. విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎంత ఫేమసో... ఆటోనగర్ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో చూపించబోతున్నారు.
నగర్ సూర్య చిత్రంలో సమంత హీరోయిన్. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈ చిత్రం రూపొందుతోంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











