అద్భుతంగా నీది నాది ఒకే కథ.. ఆ సినిమా జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.. దేవకట్టా

By Rajababu

భారీ బడ్జెట్, అగ్ర హీరోల సినిమాలను పక్కన పెట్టి.. విభిన్నమైన కథ, కథనాలతో వస్తున్న చిత్రాలకు ఇటీవల కాలంలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు, పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి లాంటి చిత్రాలు ఊహించిన విజయం సాధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్న చిత్రం నీది నాదీ ఒకే కథ. ఈ చిత్రం త్వరలోనే విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు దేవ కట్టా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు. ఆయన ఏమన్నారంటే..

సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూ..

సినిమా జ్ఞాపకాలు వెంటాడుతూ..

నీది నాది ఒకే కథ చిత్రాన్ని ఎడిటింగ్ టేబుల్‌పై ఫైనల్ కట్ చూసే అవకాశం దక్కింది. టైటిల్ తగిన కథే అనడంలో సందేహం అక్కర్లేదు. సినిమా చూసిన తర్వాత ఇంకా ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి అని దేవ కట్టా అన్నారు.

 అద్భుతమైన కథను

అద్భుతమైన కథను

దర్శకుడు వేణు ఊడుగుల అద్భుతంగా కథను రాసుకొని తెరకెక్కించారు. చిత్ర యూనిట్ ఆమోఘంగా తన బాధ్యతను నేరవేర్చింది. శ్రీ విష్ణు నటన మాటల్లో చెప్పలేకుండా ఉన్నది అని దేవ కట్టా ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

మంచి ఫీల్‌గుడ్ సినిమాను

మంచి ఫీల్‌గుడ్ సినిమాను నారా రోహిత్, నా క్రియేటివ్ పార్ట్‌నర్ కృష్ణ విజయ్ నిర్మించడం సంతోషంగా ఉంది. నా ప్రస్థానం సినిమాకు కృష్ణ విజయ్ ఎగ్గిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి నిర్మాతగా మారారు. అలాగే నారా రోహిత్ నటించిన అసుర చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఫిబ్రవరిలోగానీ, మార్చిలో గానీ

నీది నాది ఒకే కథ చిత్రంలోని ఏదో జరిగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు యూట్యూబ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఫిబ్రవరి చివరి వారంలో గానీ, మార్చి తొలివారంలో గానీ ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X