మరో రీమేక్: ఈసారి విష్ణు-దేవా కట్టా కాంబినేషన్

By Bojja Kumar

హైదరాబాద్: శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు హీరోగా నటించిన తమిళ చిత్రం 'అరీమా నంబి' ఇటీవల విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించారు. 'అరీమా నంబి' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని మంచు విష్ణు-దేవా కట్టా కాంబినేషన్లో రీమేక్ చేయబోతున్నారు. 'ఆటోనగర్ సూర్య' తర్వాత దర్శకుడు దేవా కట్టా చేయబోయే చిత్రం ఇదే. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన 'అరిమా నంబి'లో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించారు.

Deva Katta announced his next film

ఆనంద్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట ప్రేక్షకాదరణ పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. దేవాకట్ట చేస్తున్న తొలి రీమేక్ చిత్రం ఇదే.

ఓ కిడ్నాప్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. గర్ల్ ఫ్రెండ్ ఆహ్వానంపై ఆమె ఇంటకి వెళ్లిన హీరో, అనుకోకుండా ఆమె కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ అమ్మాయి తండ్రి తన కూతురు కిడ్నాపే కాలేదంటాడు. తాగి తప్పుడు కేసు పెట్టాడని పోలీసులు హీరోనే అనుమానిస్తారు. ఆఖరికి ఈ వ్యవహారం ఓ టీవీ చానెల్ యజమాని, ఎస్‌డి కార్డు, కేంద్ర మంత్రి, ఓ మోడల్ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. చివరకు ఏమయిందన్నది మిగిలిన కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X