పదేళ్ల ‘ప్రస్థానం’.. దేవ కట్టా ఎమోషనల్ ట్వీట్

ఓ దర్శకుడు పది కాలాలా పాటు గుర్తుండి పోవాలంటే వందల కొద్ది సినిమాలు చేయాల్సిన పని లేదు. ఒకే ఒక్క చిత్రం తీసినా చాలు. దేవాకట్టా కూడా ఎప్పటికీ నిలిచిపోయే దర్శకుడని చెప్పడానికి ప్రస్థానం అనే సినిమా చాలు. ఈ చిత్రం విడుదలై నేటికి పదేళ్లు అవుతోంది.అయినా మనం ఇంకా ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నామంటే.. ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్థానం సినిమా మేకింగ్ పరంగా, కథ పరంగా, నటీనటుల పర్ఫామెన్స్ పరంగా ఇలా ప్రతీదాంట్లోనూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసింది. సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ఇలా ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కమర్షియల్‌గా సక్సెస్ అయిందా లేదా అన్నది పక్కన పెడితే.. ప్రతీ ఒక్కరూ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అయితే మళ్లీ ఆ స్థాయిలో మరో చిత్రాన్ని తెరకెక్కించడంలో దేవాకట్ట విఫలమవ్వడమే బాధాకరమైన అంశం.

Deva Katta Become Emotional On 10 years Of Prasthanam

అయితే ప్రస్థానం చిత్రానికి పదేళ్లు నిండటంతో సోసల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు డైరెక్టర్ దేవాకట్ట. 'పదేళ్లైనా కూడా ప్రస్థానం చిత్రాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు ధన్యవాదాలు... మరో గొప్ప చిత్రాన్ని అందించేందుకు ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నానంటే.. దానికి మీరిచ్చే ప్రశంసలు, మీరు పెట్టుకున్న అంచనాలే కారణం. నేను తదుపరి చేయబోయే సాయి ధరమ్ తేజ్ చిత్రానికి అవే నా బలమ'ని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X