మహేష్ పై దేవకట్టా జోక్..ఫ్యాన్స్ ఆగ్రహం
దర్శకుడు దేవకట్టా రీసెంట్ గా ట్విట్టర్ లో ..ఓ జోక్ ని పెట్టారు. ఆ జోక్ మహేష్ ది బిజినెస్ మ్యాన్ లో డైలాగుని ఉద్దేశించింది కావటంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి దారితీసింది. ఆ జోక్ ఏమిటంటే..
పేషెంట్:"నాకు ఉచ్చ రావటం లేదు"
డాక్టర్: "ముంబై వెళ్లు అక్కడ మహేష్ అందరికీ ఉచ్చపోయిస్తున్నాడు"!
ఈ జోక్ ని నిజానికి యువ దర్శకుడు దేవ కట్టా సరదాకోసమే పెట్టినా మహేష్ ఫ్యాన్స్ దీనిపై చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దాంతో వెంటనే దేవకట్టా..ఓ డైలాగుని జోక్ చేస్తున్నామంటే దానికి కల్ట్ స్టేటస్ వచ్చినట్లే..అయినా మహేష్ కామిడి టచ్ తో చెప్పానన్నాడు అంటూ రాసారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం మహేష్ దీన్ని చాలా సీరియస్ గా ఎవరికో వార్నింగ్ ఇస్తూ చెప్తున్నట్లు ఉంటుంది. ఇక ప్రస్తుతం దేవకట్టా...నాగచైతన్యతో ఆటో నగర్ సూర్య అనే చిత్రం చేస్తున్నారు. మహేష్ తన బిజినెస్ మ్యాన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యి డబ్బింగ్ పనుల్లో హడావిడిగా ఉంది. బిజినెస్ మ్యాన్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











