ఆ సినిమా ఓ కమర్షియల్ హీరోగా నిలబెడుతుంది...!
వెన్నెల, ప్రస్థానం, వంటి ఉత్తమ చిత్రాల్ని రూపొందించిన దేవా కట్టా, లేటెస్ట్ గా నాగచైతన్యతో చేయబోతున్న 'ఆటోనగర్ సూర్య" షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బేనర్ లో వెంకట్ నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రంలో నాగచైతన్య ప్రధాన పాత్ర చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం దేవా కట్టా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సబ్జెక్ట్ కి యాప్ట్ అయ్యే లొకేషన్స్ చూడడంలో బిజీగా ఉన్నాడు. విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందునున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన క్యూట్ హీరోయిన్ సంమత నటిస్తోంది.
వెన్నెల మరియు ప్రస్థానం వంటి, తన మొదటి రెండు చిత్రాల్ని ఎంతో కమిట్ మెంట్ తో తీసిన దేవా ఈ చిత్రాన్ని అంత కంటే ఎక్కువ కేర్ తీసుకొని చేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే నాగచైతన్య తన మొదటి సినిమా జోష్ తో నిరాశపడ్డప్పటికీ రెండో సినిమా ఏమాయ చేసావె సక్సెస్ కావడంతో అతనిలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆటోనగర్ సూర్య డెఫినెట్ గా తనని కమర్సియల్ హీరోగా నిలబెడుతుందన్న నమ్మకం నాగచైతన్యకి వుంది.


Click it and Unblock the Notifications











