శర్వానంద్ 'ప్రస్ధానం' నాలుగుపాటలు తొలిగింపు
మొన్న శుక్రవారం రిలీజైన ప్రస్ధానం చిత్రంలో నాలుగు పాటలు తొలిగించాలని దర్శకుడు దేవకట్టా నిర్ణయించుకున్నారు. దాంతో ఇరవై నిముషాల సేపు ట్రిమ్మింగ్ జరిగినట్లు అవుతుంది. పాటలు కథనానికి అడ్డంగా మారినట్లు చూసిన వారు ఫీలవటంతో వాటిని తొలిగిస్తున్నామని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో శర్వానంద్, సాయికుమార్ కీలకపాత్రలు చేసారు. వెన్నెల చిత్రం అనంతరం లాంగ్ గ్యాప్ తో దర్శకుడు దేవకట్టా ఈ చిత్రాన్ని రూపొందించారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం సాగుతుంది. శర్వానంద్ ఎప్పటికన్నా మంచి నటన చూపాడని, సాయికుమార్ కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా మారుతుందని అంతా చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని రీసెంట్ గా కృష్ణవంశీ, క్రిష్(గమ్యం), ఛోటాకె నాయుడు, అల్లరి నరేష్, తనీష్ చూసి అభినందించారు. ఛోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ ఈ చిత్రంలో శర్వానంద్ తమ్ముడుగా చేసి మెప్పించాడు.
ప్రస్దానం శర్వానంద్ పార్వతి మిల్టన్ రాజా సాయి కుమార్ రూబి దేవకట్టా సందీప్ prasthanam sharvanand parvathi melton saikumar deva katta sandeep


Click it and Unblock the Notifications