యాక్షన్ హీరోతో...దేవా కట్ట నెక్స్ట్ చిత్రం ఖరారు

By Srikanya

హైదరాబాద్ : నాగచైతన్య హీరోగా దేవా కట్టా డైరక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య ' చిత్రం రిలీజ్ బాగా లేటయ్యేటట్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్ర దర్శకుడు దేవా కట్టా తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సారి యాక్షన్ హీరో గోపీచంద్ ని గోపీచంద్ ని డైరక్ట్ చేయనున్నారు. ఈ విషయమై దేవకట్టా స్వయంగా ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు.

దేవకట్టా ట్వీట్ లో ... "నా తదపరి చిత్రం గోపీచంద్ తో ఉంటుంది. అది ఓ ఓ యాక్షన్ ఎంటర్టైనర్, మే నెల నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ", అని ట్వీట్ చేసారు. అలాగే... 'ఆటోనగర్ సూర్య' విడుదల గురించి చెప్తూ.. " మీ అందరి లాగే నేను కూడా ఆటోనగర్ సూర్య విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ", అన్నారు.

కొంతకాలం క్రితం దేవా కట్టా... 'అబద్దానికే అంత దమ్ముంటే, నిజానికి ఎంత దమ్ము ఉండాలి'.. అనే కాన్సెప్ట్ తో ఓ చిత్రం చేస్తానని ట్వీట్ చేసారు. అప్పట్లో నానితో ఆ చిత్రం అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు గోపీచంద్ తో చిత్రం అని ఖరారు చేయటంతో అదే థీమ్ తో గోపీచంద్ చిత్రమే తెరకెక్కుతుందేమో అంటున్నారు.

ఇక గోపీచంద్‌ విషయానికి వస్తే... తాప్సీ హీరోయిన్ గా.. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'జాక్‌పాట్‌' అనే టైటిల్ వర్కింగ్ టైటిల్ గా పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి 'సాహసం ' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. చిత్తరం పూర్తిగా ఎండ్వెంచర్స్ తో నడవటంతో ఈ టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిధి నిక్షేపాల అన్వేషణే ప్రధాన నేపథ్యంగా ఈ సినిమా తయారవుతోంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మైంట్స్ సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామోజీ ఫిల్మ్‌సిటీ, లడక్‌, రాజస్థాన్‌, జోర్డాన్‌లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X