వెన్నెల చిత్రంతో పరిచయమైన ఎన్నారై దర్శకుడు దేవకట్టా మళ్ళీ మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ప్రస్ధానం టైటిల్ తో రూపొందుతున్నఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా చేయనున్నాడు. శర్వానంద్..గతంలో వెన్నెల చిత్రంలో నెగిటివ్ రోల్ చేసారు. జూన్ పదినుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రానికి వెన్నెల ఫేమ్ మహేష్ శంకర్ ట్యూన్స్ అందిస్తున్నాడు. మహేష్ ఈ మద్యే ప్రయాణం చిత్రానికి సంగీతం అందించారు. అలాగే సవితా సింగ్ అనే కెమెరా మెన్ తెలుగు తెరకు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. వల్లభనేని రవి నిర్మిస్తున్న ఈ చిత్రంకి స్క్రిప్టే బంల అంటున్నాడు దేవ కట్టా. బెస్ట్ ఆఫ్ లక్ దేవ..