twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఆటోనగర్ సూర్య’ విషయమై నిరాశగా దేవకట్టా

    By Srikanya
    |

    హైదరాబాద్: 'డైరక్టర్ కూడా సినిమా రిలీజ్ విషయానికి వస్తే ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. అతనికి వేరే ఛాయిస్ లేదు.. ఏం చెబితే అది నమ్మాలి. క్రితం వారమే ఆటో నగర్ సూర్య కి సంభందించి నా వర్క్ పూర్తై పోయింది. ప్రతీ ఆర్టిస్టు,టెక్నిషియన్ తామ కంట్రిబ్యూషన్ కి ,తాము సాధించిన దానికి చాలా గర్వంగా ఫీలవుతారు' అంటూ నిస్సహాయంగా దర్శకుడు దేవకట్టా ట్విట్టర్ లో తన ఆవేదన వెల్లబుచ్చారు.

    నాగచైతన్య, సమంత జంటగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో దేవా కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య' . పిభ్రవరి 27న ఈ చిత్రం విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించామని ప్రకటించారు. అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మళ్లీ ఫోస్ట్ ఫోన్ అయ్యే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్దికపరమైన కారణాలే రిలీజ్ కు అడ్డం పడుతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఏ సమాచారం లేదు. ఈ నేపధ్యంలో దేవకట్టా ఇలా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.


    మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆంధ్రా రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. దాదాపు ఎనిమిది కోట్లు ఈ రైట్స్ నిమిత్తం వెచ్చించినట్లు చెప్తున్నారు. దాంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక నెల్లూరు రైట్స్ ని హరి పిక్చర్స్ వారు సొంతం చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి 22 కోట్లు అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఎంత బిజినెస్ అయినా దాన్ని రీచ్ అవటం కష్టమంటున్నారు.

    అచ్చిరెడ్డి చిత్రం గురించి మాట్లాడుతూ 'మా సినిమాలో రీరికార్డింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే సంగీత దర్శకుడు అనూప్ బాగా టైమ్ తీసుకుని అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. రీరికార్డింగ్ పూర్తి కాగానే ఆడియో, సినిమా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేస్తాం. ఈ చిత్రంలో నాగచైతన్య క్లాస్ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాడు. నాగచైతన్య, సమంత కాంబినేషన్‌లో మరో హిట్ మూవీ అవుతుంది. అలాగే 'ప్రేమ కావాలి', 'పూలరంగడు' చిత్రాల తరువాత మా బేనర్‌కి 'ఆటోనగర్ సూర్య' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

    ఈ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు సూర్య. అతను అనాథ. కానీ అనామకుడు మాత్రం కాదు. ఆటోనగర్‌ అంటే ఆ ఊళ్లో అందరికీ తెలుసు. అయితే ఆ పేరు వినబడగానే అక్కడ సూర్య అనే ఓ యువకుడు ఉంటాడనే విషయం కూడా గుర్తుకు తెచ్చుకొంటారు. అదీ అతను సంపాదించిన పేరు. సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి యువకుడి జీవితానికి ఎవరు అడ్డుగా నిలిచారు? వారికి సూర్య ఎలా సమాధానం చెప్పాడు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.

    విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దేవకట్ట తనదైన స్టైల్లో తెరకెక్కించినట్లు సమాచారం. కె అచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈచిత్రం రూపొందుతోంది. సాయికుమార్‌ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

    English summary
    deva katta tweeted: As of last week my wrk wth ANS is complete. Evry artist & technician who contributed to d film r extremely proud of wht they could achieve ! A director is merely a spectator whn it comes to d release of a film jst like d audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X