twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు మనోజ్..సన్నిలియోన్ ఇలా... (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కరెంట్ తీగ'. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో మంచు మనోజ్ ఈ సినిమాలో పాడిన దేవదాసు అనే ఫుల్ బ్రేకప్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ లో సన్నిలియోన్ కూడా కనిపిస్తుంది. దేవదాసు అంటూ పాడే ఈ పాటలో పార్వతిగా ఆమె కనిపించనుంది.

    ఈ సినిమాని మంచు విష్ణు24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ‘ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. మంచు మనోజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సినిమా కరెంట్ తీగ ' అని మంచు విష్ణు అన్నాడు.

    మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది.

    DEVADAS BREAK UP SONG Making - Current Theega Movie

    ప్రస్తుతం మనోజ్ దృష్టి మొత్తం ఆయన తాజా చిత్రం కరెంట్‌తీగ పై ఉంది. ఆ చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... పాండవులు పాండవులు తుమ్మెద తరువాత కరెంట్‌తీగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. దీనికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు విష్ణు అన్నయ్యతో దేనికైనా రెడీ వంటి సూపర్‌డూపర్ హిట్టిచ్చారాయన. ఇప్పటి వరకు నేను పనిచేసిన దర్శకుల్లో కరెక్ట్‌గా నా బెండుతీసి నాతో వర్క్ చేయించుకుంటున్నారు. రాఘవేంద్రరావు, చంద్రశేఖర్ ఏలేటిల తరువాత జి.నాగేశ్వరరెడ్డి అంతబాగా అంకిత బావంతో పనిచేస్తున్నారు.

    సినిమా చాలా బాగా వస్తోంది. ఇందులో ఫుల్ ఎనర్జీతో రఫ్ అండ్ టఫ్‌గా వుండే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాను. దేవుడి దయవల్ల సినిమా బాగా వస్తోంది. ఇందులో జగపతిబాబుగారు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రత్యేక పాత్రలో సన్నిలియోన్ నటిస్తోంది. ఆమె పాత్రకున్న ప్రాముఖ్యత ఎలాంటిదో చెప్పడం కంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది అన్నారు.

    English summary
    Manchu Manoj has sung a song titled 'Devdas', which is modelled like a break up song that comes just before the film's climax. "I dedicate this song to all the girls who inspired me," Manoj remarked in a rather cheeky manner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X