మీ అమ్మ అఘాయిత్యం చేసుకుంటే భరించగలవా? యాంకర్ సుమకు అప్పుడే చెప్పా...

యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10, 1999లో వీరి వివాహం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వీరి లవ్ స్టోరీ గురించి రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

రాజీవ్ నాలాగే ఎవరిని పడితే వారిని ప్రేమిస్తాడు, కాకపోతే బయటకు చెప్పుకోడు. కానీ సుమ చాలా డిగ్నఫైడ్. మేఘమాల సీరియల్ చేస్తున్నపుడు నాకు పరిచయం. చాలా మంచి అమ్మాయి అనిపించింది. అప్పుడే నా ఇంటి కోడలైతే బావుండు అనుకున్నాను. కానీ తర్వాత రాజీవ్ ప్రేమించి ఆమెను మా ఇంటికి తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నారు.

సుమ నాకు ఫోన్ చేసి పెళ్లి గురించి అడిగింది

సుమ నాకు ఫోన్ చేసి పెళ్లి గురించి అడిగింది

‘‘మేఘమాల సీరియల్ సమయంలో సుమ వెంట వాళ్ల అమ్మ ఉండేది. ఆ సమయంలో రాజీవ్ ఆమెను రహస్యంగా కలిసేవాడు. ఒక రోజు నాకు సుమ ఫోన్ చేసి.. అంకుల్ నేను, రాజీవ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, పలానా వారు చేస్తామన్నారు అని చెప్పింది. వాళ్లెందుకు.. అన్నీ పెట్టుకుని నేనే చేస్తాను అన్నాను'' అని దేవదాస్ కనకాల గుర్తు చేసుకున్నారు.

మీ అమ్మ అఘాయిత్యం చేసుకుంటే భరించగలవా? అన్నాను

మీ అమ్మ అఘాయిత్యం చేసుకుంటే భరించగలవా? అన్నాను

సుమ వాళ్ల ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు. అప్పుడు ఆమెకు ఒకటే విషయం చెప్పాను. మీ అమ్మకు నువ్వు ఒక్కగానొక్క కూతురు... ఆవిడ ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే నువ్వు భరించగలవా? అందుకే ఆలోచించి చూడు అన్నాను. తర్వాత వాళ్ల ఇంట్లో వారిని ఇప్పించింది. బంధువులతో మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం కూదుర్చుకున్నారు. వాళ్ల లవ్ స్టోరీ ఆ విధంగా సుఖాంతం అయిందని దేవదాస్ కనకాల తెలిపారు.

సుమలో డిగ్నఫైడ్ బిహేవియర్ అంటే ఇష్టం

సుమలో డిగ్నఫైడ్ బిహేవియర్ అంటే ఇష్టం

పెళ్లికి రెండేళ్ల ముందు మేఘమాల సమయంలోనే సుమ నాకు పరిచయం. సుమలో డిగ్నఫైడ్ బిహేవియర్ అంటే ఇష్టం. చిచ్చోర భావాలుకానీ, ప్రవర్తన కానీ చేయడానికి వీల్లేకుండా ఆమె ప్రవర్తన ఉంటుంది. చాలా తెలివగా మాట్లాడుతుందని దేవదాస్ కనకాల తెలిపారు.

అందుకే ఆమె క్రియేటివ్ ఆర్టిస్ట్ అయింది

అందుకే ఆమె క్రియేటివ్ ఆర్టిస్ట్ అయింది

‘‘సుమ గ్రేట్ ఆర్టిస్ట్. ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తుంది. అందుకే ఆమె క్రియేటివ్ ఆర్టిస్ట్ అయింది. ఇంట్లో యాంకరింగ్ చేయదు, పిల్లలను చూసుకోవడం, మమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లడం చేస్తుంది. తన పాపులారిటీని ఎప్పుడూ తలకెక్కించుకోలేదు. కొందరిలో అది కనిపిస్తుంది, కానీ సుమలో ఇసుమంతైనా కనిపించదు.'' అని దేవదాస్ కనకాల తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X