twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవదాస్ కనకాల కన్నుమూత: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం

    |

    Recommended Video

    Anchore Suma Father-In-Law Devadas Kanakala Is No More || Filmibeat Telugu

    యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. దేవదాస్ కనకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

    1974లో ఓ సీత కథ సినిమా ద్వారా నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన దాదాపు 30 సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    యానం సమీపంలోని కనకాల పేటలో జననం

    యానం సమీపంలోని కనకాల పేటలో జననం

    1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం‌లో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి కొన్ని రోజులకే దాన్ని వదిలేశారు.

    ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమారంగం వైపు

    ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమారంగం వైపు

    ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. నటుడిగా, దర్శకుడిగా రాణించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు.

    చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు ఎందరికో శిక్షణ

    చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు ఎందరికో శిక్షణ

    నటీనటులకు శిక్షణ ఇస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి ప్రముఖులు సైతం ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు.

    దేవదాస్ కనకాల కుటుంబం

    దేవదాస్ కనకాల కుటుంబం

    దేవదాస్ కనకాల 1971లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తే . వీరికి కుమారుడు రాజీవ్ కనకాల, ఒక కుమార్తె శ్రీలక్ష్మీ ఉన్నారు. రాజీవ్ కనకాల నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ వివాహం యాంకర్ సుమను పెళ్లాడారు.

    English summary
    Devadas Kanakala passed away. Devadas Kanakala is an Indian actor. He is from Andhra Pradesh who predominantly appeared in Telugu language films. Super Star Rajini Kanth, Chiranjeevi and Rajendra Prasad are the students of Devadas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X