దేవదాస్‌పై పైరసీ దెబ్బ.. పూర్తి సినిమా లీక్.. డౌన్‌లోడ్ చేసుకోవద్దని రిక్వెస్ట్
Recommended Video

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన దేవదాస్ చిత్రం పైరసీ బారిన పడింది. దేవదాస్ పూర్తి చిత్రం టొరెంట్ వెబ్‌సైట్లో లీకైంది. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోమంటూ ఆప్షన్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ నిర్ఘాంతపోతున్నది. పైరసీ వ్యవహారం సినిమా వసూళ్లపై భారీ ప్రభావం చూపుతుందనే ఆందోళనను నిర్మాతలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజైన సంగతి తెలిసిందే.

మూడో ఆటకు ముందే లీక్
దేవదాస్ రిలీజైన రోజే మూడో ఆటకు ముందే సినిమా మొత్తం టొరెంట్‌లోకి లోడైంది. సినిమా హాల్‌లో ప్రదర్శన జరుగుతుండగా రికార్డు చేసినట్టు స్పష్టమైంది. ఈ సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆరు రకాల సదుపాయాలను ఇవ్వడం గమనార్హం.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

రంగంలోకి నిర్మాతలు
దేవదాస్ సినిమా పైరసీ గురికావడంతో వైజయంతీ మూవీస్ రంగంలోకి దిగింది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇంటెర్నెట్ మీడియా నుంచి పైరసీ కాపీని తొలగించేందుకు చర్యలు తీసుకొంటున్నది. ఈ వ్యవహారంతో డిస్టిబ్యూటర్లకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.

డౌన్‌లోడ్ చేసుకోవద్దని
మా సినిమా అయినా గానీ, ఇతర చిత్రాలైనా పైరసీ చేయడాన్ని వ్యతిరేస్తున్నాం. భారీగా డబ్బు వెచ్చించి సినిమాను తెరకెక్కించాం. చాలా మంది శ్రమించారు. వారి కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అవుతుంది. ఎవరూ కూడా పైరసీ కాపీని డౌన్‌లోడ్ చేయవద్దు. థియేటర్‌లోని సినిమాను చూసి మాకు అండగా నిలువండి అని చిత్ర యూనిట్ పేర్కొన్నది.

30 కోట్ల బడ్జెట్‌తో
దేవదాస్ చిత్రాన్ని రూ.30 కోట్లతో తెరకెక్కించారు. థియేట్రికల్ హక్కులు అమ్మడం ద్వారా సుమారు రూ.38 కోట్లు రాబట్టారు. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. పైరసీని అడ్డుకుంటే వారాంతంలో భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











