»   » బర్త్ డే స్పెషల్ పిక్స్: నాగార్జున లుక్ చూసి అంతా షాక్!

బర్త్ డే స్పెషల్ పిక్స్: నాగార్జున లుక్ చూసి అంతా షాక్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Devadas Movie Team Releases Nagarjuna's News Look

  మన్మధుడు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అక్కినేని నాగార్జున. ఆయన ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు గడిచినా... రోజు రోజుకు ఆయనలో అందం పెరుగుతుందనే తప్ప తరగడం లేదు. అరవై ఏళ్లకు చేరువైనా ఆయనంటే అమ్మాయిలు పడి చస్తున్నారంటే... ఈ మన్మధుడి మాయాజాలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 29తో నాగార్జున 59వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా 'దేవదాస్' మూవీ టీం ఆయనకు సంబంధించిన కొన్ని స్పెషల్ ఫోటోస్ విడుదల చేశారు. ఇప్పటికీ ఆయనలో గ్లామర్ ఏమాత్రం తగ్గక పోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

  అక్కినేని వారసుడిగా

  అక్కినేని వారసుడిగా

  1959 ఆగష్టు 29న జన్మించిన నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేసి 1986లో ‘విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు.

  టాలీవుడ్ అగ్రహీరోల్లో

  టాలీవుడ్ అగ్రహీరోల్లో

  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ శకం ముగిసిన తర్వాత ఇండస్ట్రీని దశబ్దాల పాటు ఏలిన నలుగురు అగ్రహీల్లో నాగార్జునది ప్రత్యేక స్థానం అని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఆయన యువ హీరోలతో... తన ఇద్దరు కొడుకులతో పోటీ పడుతూ నటిస్తూనే ఉన్నారు.

  కొత్తవారిని పరిచయం చేయడంలో టాప్

  కొత్తవారిని పరిచయం చేయడంలో టాప్

  ఇండస్ట్రీలోని అందరి హీరోలతో నాగార్జున మంచి రిలేషన్ ఫిప్ మెయింటేన్ చేస్తుంటారు. దాంతో పాటు కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఆయన తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులను, నటులును టాలీవుడ్ కి పరిచయం చేశారు.

  దేవదాస్

  దేవదాస్

  నాగార్జున నటిస్తున్న ‘దేవదాస్' సినిమా విషయానికొస్తే.... నాగార్జున ఈ చిత్రంలో దేవ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ‘దాస్' అనే డాక్టర్ పాత్రను నాని పోషిస్తున్నారు. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని స్పెషల్ ఫోటోస్ విడుదల చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు. వైజయంతి మూవీస్ బేనర్లో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  English summary
  The teaser of ‘DevaDas’ featuring Nagarjuna Akkineni and Nani in the lead roles, has got a tremendous response. The first look also met with terrific feedback.With this super response, the makers of the film will be releasing a solo look of Nagarjuna on the mark of his birthday tomorrow i.e, on August 29th. Nag is playing the role of Deva in the movie. Sriram Adittya is directing the movie having Rashmika Mandanna and Aakanksha Singh in the female lead cast. Mani Sharma is composing music for this entertainer. C Ashwini Dutt is producing ‘DevaDas’ under Vyjayanthi Movies banner and the release date of the film is confirmed on September 27th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more