నాగ్, నాని కలిస్తే మరీ ఈస్థాయిలోనా.. షాకిస్తున్న ప్రీరిలీజ్ బిజినెస్, హిట్ కావాలంటే!
Recommended Video

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధం అవుతోంది. మల్టీస్టారర్ చిత్రాలపై సాధారంగానే ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నాగ్, నాని కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. నాగార్జున దేవాగా డాన్ పాత్రల, నాని దాసుగా డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటిస్తున్న చిత్రం కావడంతో సాధారణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువగానే జరుగుతుంది. కానీ దేవదాస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క షాక్ ఇచ్చే విధంగా ఉంది.

శ్రీరామ్ ఆదిత్య దర్శత్వంలో
యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉంది. శ్రీరామ్ ఆదిత్యకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలతో చిత్రాన్ని సమర్థవంతంగా రూపొందించిందని కొనియాడుతున్నారు. ట్రైలర్ లో నాగార్జునని డాన్ గా, నానిని డాక్టర్ గా అద్భుతంగా చూపించాడు.

వైజయంతి మూవీస్
ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు. నాగార్జున, నాని స్టార్ డమ్ కు భారీ నిర్మాణ సంస్థ తోడు కావడంతో దేవదాస్ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. అన్ని ఏరియాలలో బయ్యర్లు ఈ చిత్రం కోసం భారీ ధర వెచ్చించారు.

బిజినెస్ లెక్క ఎంతంటే
రెండు తెలుగు రాష్ట్రలో దేవదాస్ పంపిణి హక్కులు 30 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో 14 కోట్లు, నైజాంలో 11 కోట్లు, సీడెడ్ లో 5 కోట్లకు దేవదాస్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక ఓవర్సీస్ లో 4.50 కోట్లకు పంపిణి హక్కులు అమ్ముడు కావడం విశేషం. రెస్టాఫ్ ఇండియాతో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా దేవదాస్ ప్రీరిలీజ్ బిజినెస్ 37 కోట్ల వరకు జరిగింది.

సూపర్ హిట్ కావాలంటే
ఈ చిత్రం సూపర్ హిట్ కావాలంటే 40 కోట్ల వరకు వసూళ్లు రాబట్టవలసి ఉంటుంది. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











