twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దేవదాస్’ ఎలా ఉంది? ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ...

    |

    నాగార్జున, నాని మల్టీస్టారర్‌గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దేవదాస్'. వై జయంతి మూవీస్ సంస్థపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నాగార్జున దేవ అనే డాన్ పాత్రలో, నాని దాస్ అనే డాక్టర్ పాత్రలో నటించారు. యాక్షన్ కామెడీ కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుండీ మంచి అంచనాలున్నాయి. ఇండియా కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. సినిమా ఎలా ఉందనే అభిప్రాయాలు ఆల్రెడీ ట్విట్టర్లో కొందరు ఫ్యాన్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మరి ఫీడ్ బ్యాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం...

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    సినిమా ఎలా ఉందంటే...

    ఫస్టాఫ్ ఫర్వాలేదనే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నాగార్జున కుమ్మేశాడు. నాని తన పార్ట్ చాలా బాగా చేశాడు. ఫస్టాఫ్ లో నాని కామెడీ బాగా ప్లస్సయింది. సెకండాఫ్ రోటీన్‌గా ఉంది.

    వెరీ యావరేజ్

    మరికొందరు మాత్రం ‘దేవదాస్' వెరీ యావరేజ్ గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    అభిమానులకు తెగ నచ్చేసింది

    అయితే నాగార్జున అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. నాగార్జున్ లుక్ చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

    యావరేజ్ మూవీ, అంచనాలతో వెళ్లొద్దు

    ‘దేవదాస్' యావరేజ్ మూవీ..... తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వెళితే మంచిది. సినిమాలో కొత్తదనం ఏమీ లేదు... అని మరికొందరు అభిప్రాయ పడ్డారు.

    జస్ట్ ఓకే బొమ్మ

    ఓకే.. ఓకే బొమ్మ. దేవదాస్ స్టోరీ ఏం లేదు. నాగార్జున, నాని మధ్య వచ్చే సీన్స్ బావున్నాయి. రష్మిక, వెన్నెల కిషోర్ సీన్స్ ఫర్వాలేదు. మరీ ఎక్కువగా ఊహించుకుని వెళ్లొద్దు.

    సినిమా చాలా బావుంది

    ఫస్టాఫ్ ఎంటర్టెనింగ్‌గా ఉంది. సెకండాఫ్ గుడ్ అనే విధంగా ఉంది. నాగార్జున, నాని మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. సెకండాఫ్‌లో నాగార్జున అదరగొట్టాడు.

    నాగార్జున్ ఇంట్రడక్షన్ సీన్లో పిచ్చెక్కించాడు

    బొమ్మ సూపర్ హిట్టు అనే విధంగా ఉంది. సినిమాలో ఫన్ అదిరిపోయింది. నాగార్జున ఇంట్రడక్షన్ సీన్ పిచ్చెక్కించాడు. నాగ్ సర్ మీకు 60 ఏళ్లు అంటే నమ్మలేక పోతున్నాం. మిమ్మల్ని ఇంకా స్క్రీన్ మీద చూడటం ఆనందంగా ఉంది.

    Recommended Video

    Akkineni Nagarjuna And Nani Making Fun @Devadas Movie Press Meet

    బ్యాడ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే

    ఓవరాల్‌‌గా దేవదాస్ యావరేజ్ మూవీ. స్టోరీలో కొత్తదనం లేదు. దర్శకుడు ఇద్దరు స్టార్లు ఉన్నా ఎలాంటి మ్యాజిక్ చేయలేక పోయాడు. బ్యాడ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే. చాలా నిరాశ పరిచే సినిమా.

    English summary
    Devadas movie twitter review and rating by audience. Devadas is an action comedy film that is high on bromance and romance quotient starring Nagarjuna and Nani. Sriram Adittya has written the story, screenplay and dialogues for the film, which has been produced by C Ashwini Dutt under his banner Vyjayanthi Movies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X