Don't Miss!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
7 రోజుల్లో రూ. 41 కోట్లు: ‘దేవదాస్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఫుల్ హ్యాపీ!
నాగార్జున, నాని కలిసి నటించిన 'దేవదాస్' చిత్రానికి బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. సినిమా ఫస్ట్ వీక్ పూర్తయిన సందర్భంగా కలెక్షన్స్ వివరాలు ప్రటిస్తూ చిత్ర బృందం మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగులో నాగార్జునతో పాటు అశ్వినీదత్, శ్రీరామ్ ఆదిత్య పాల్గొన్నారు. మాలో అందరికీ వ్యక్తిగతంగా చాలా హ్యాపీగా ఉంది. దత్తుగారు ఈ సినిమాకు వచ్చిన ఫిగర్స్ చెబితే ఆనందంగా అనిపించిందని నాగార్జున తెలిపారు.
7 రోజుల్లో 41 కోట్ల గ్రాస్
‘దేవదాస్' 7 రోజుల్లో రూ. 41 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పగానే ఎంతో హ్యీగా ఫీలయ్యాను. ఈ శనివారం, ఆదివారం వసూళ్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ సినిమా ఫ్యామిలీస్ అందరూ చూడాల్సిన సినిమా. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు... అని నాగార్జున అన్నారు.
Recommended Video
నాని వల్లే ఈ విజయం
సినిమా విజయానికి ముఖ్య కారణం నాని. దాస్ పాత్రలో చాలా బాగా చేశాడు. మల్టీస్టారర్ అంటే ఎవరి రోల్స్ ఎక్కువ అని ఆలోచిస్తే సినిమా చెడిపోతుంది. మేము ఇవేమీ పట్టించుకోకుండా సినిమా బావుండాలని చేశాం. అందుకే ఏ ఇబ్బంది లేకుండా సినిమా పూర్తయింది.
అందరికీ థాంక్స్
నన్ను స్టైలిష్గా డాన్ దేవా రోల్లో యాక్సెప్ట్ చేసినందుకు అందరికీ థాంక్స్. నా పాత్రకు మంచి కాంప్లిమెంట్స్ రావడం చూస్తే, ఇలాంటి రోల్స్ చాలా చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది. శివ వచ్చి అప్పుడే 29 ఏళ్లయిందా అని అనిపించింది... అని నాగార్జున అన్నారు.
కర్నాటకలో అదరగొట్టింది
నాగేశ్వరరావుగారి ‘దేవదాస్' పేరును పెట్టుకున్నందుకు ఈ సినిమా కూడా పెద్ద విజయవంతమైనందుకు తెలుగు సోదరీసోదరులకు ధన్యవాదాలు. కర్ణాటకలో తొలిసారి 7 రోజుల్లో రూ.2కోట్ల 37 లక్షల షేర్ వచ్చింది. ఇది చాలా మంచి రికార్డ్. నాగార్జునగారు 29 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడూ అలాగే ఉన్నారని అందరూ అంటున్నారు. నాని కామెడీ బాగా చేశారని అంటున్నారు. ఈ రెండు సినిమాకు కలిసొచ్చాయి అని నాగార్జున అన్నారు.