twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Netflix బాహుబలి గొడవ ఇదే.. ఆ లెవెల్లో చేయాలి అంటే కష్టం.. అందుకే వెనక్కి వచ్చేశాం: దేవకట్టా

    |

    ఇండియన్ సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్ళిన బాహుబలి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా మార్కెట్ ను కూడా అమాంతంగా పెంచేసింది. ఇండియాలో కూడా రెండు వేల కోట్ల మార్కెట్ ఉన్న సినిమాలు విడుదలవుతాయని అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. మన దర్శకులకు అవకాశం ఇస్తే ఎంతటి బిగ్ బడ్జెట్ సినిమా అయినా సరే తెరకెక్కిస్తారని ఆ సినిమా రుజువు చేసింది. అయితే బాహుబలి కూడా అక్కడితో ఆగిపోకుండా దాన్ని వెబ్ సీరీస్ గా కూడా కొనసాగించాలని చాలామంది అనుకున్నారు.

    రాజమౌళి మద్దతుతో..

    రాజమౌళి మద్దతుతో..

    అందుకు రాజమౌళి కూడా పూర్తి మద్దతు ఇవ్వడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒక భారీ ప్రయోగానికి సిద్ధమైంది. బాహుబలి విడుదలైన కొన్ని నెలలకే వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టారు. అయితే మొదట ఆ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ దర్శకులకు సెలెక్ట్ చేసుకున్నారు. రాజమౌళి సలహా మేరకే దర్శకుడు దేవకట్టా సెలెక్ట్ అయ్యాడు.

    అంతేకాకుండా ప్రవీణ్ సత్తారు కూడా కొన్ని ఎపిసోడ్స్ కి డైరెక్షన్ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ ర‌చ‌యిత ఆనంద్ నీల‌కంఠ‌న్ రాసిన 'ది రైజ్ ఆఫ్ శివ‌గామి' నవల ఆధారంగా బాహుబలి కథలు ఇంకా కొనసాగించాలని అనుకున్నారు. వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ సంస్థ మరింత గుర్తింపు తెచ్చుకోవాలని భారీ బడ్జెట్ కూడా కేటాయించింది.

    వెనకడుగు వేయకుండా

    వెనకడుగు వేయకుండా

    'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తరహాలో ఉండాలని ఎన్నో ప్రణాళికలు రచించారు. అనుకున్నట్టుగానే స్క్రిప్టు మొత్తం కూడా సిద్ధమైంది.మొత్తానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాహుబలి వెబ్ సిరీస్ ను షూటింగ్ మొదలు పెట్టింది. వాళ్లు ఎక్కువగా రాజమౌళి సలహాలు కూడా తీసుకున్నారు. అయితే మొదలు పెట్టిన కొన్ని రోజులకే ఆ వెబ్ సిరీస్ ఆగిపోయింది. తెలుగు దర్శకులు సరైన అవుట్ పుట్ ఇవ్వకపోవడంతో తీసేశారని ఒక టాక్ అయితే వచ్చింది. ఇక ఆ తర్వాత మరొక టీమ్ తో తో కలిసి మళ్ళీ కొత్తగా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినట్లు కథనాలు వెలువడ్డాయి.

    దేవకట్టా, ప్రావీన్.. వెళ్లిపోవడానికి కారణమేంటి

    దేవకట్టా, ప్రావీన్.. వెళ్లిపోవడానికి కారణమేంటి

    మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిన అనంతరం నయనతార, వామికా గబ్బి వంటి టాలెంట్ నటిమనులను కూడా ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక మొదట ఎంతో ప్రణాళికలతో బాహుబలి వెబ్ సీరీస్ ను స్టార్ట్ చేసిన దేవాకట్ట, ప్రవీణ్ సత్తారు ఎందుకు బయటికి వచ్చేశారన్నది కొన్నాళ్ళు ఎవరికి అర్థం కాలర్డు. ప్రాజెక్ట్ విషయంలో ఈ దర్శకుల పనితీరు వారికి నచ్చకపోవడం వల్లనే వెనక్కి తగ్గినట్లు టాక్ అయితే వచ్చింది.

    Recommended Video

    Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
    అందుకే బయటకు వచ్చేశాము

    అందుకే బయటకు వచ్చేశాము

    అయితే ఈ విషయంలో ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు దేవకట్ట ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. బాహుబ‌లిని కూడా ఒక 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లాగా చేయాలని అందరి ఆలోచన. అయితే అలాంటి ప్రాజెక్టు కేవలం ఇద్దరి దర్శకులతో సెట్టయ్యే అవకాశం ఉండదు. ప్రాజెక్ట్ కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌' కథను కూడా పదేళ్లు రాసిన తరువాత మరొక ఐదారేళ్లు స్క్రీన్ ప్లే కోసం టైమ్ తీసుకున్నారు.

    వాళ్ళు చాలా క్లారిటీగా చేశారు. అయితే బాహుబలి వెబ్ సీరీస్ కూడా అదే తరహాలో చేయాలి కాబట్టి మా సమయాన్ని ఆ ఒక్క ప్రాజెక్ట్ కోసమే వెచ్చించాలి అంటే అంత ఈజీ కాదు. అందుకే ఒక సీజన్ ను రాసి ఆ తరువాత డైరెక్ట్ చేసి బయటకు వచ్చెయడం జరిగింది.. అని దేవకట్టా చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు.

    English summary
    Devakatta about Bahubali netflix web series latest news
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X