Devara: ఎన్నికల ఎఫెక్ట్‌తో దేవర వాయిదా.. ఎన్టీఆర్ మూవీపై ఇదిగో అసలైన క్లారిటీ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీలు చాలానే రూపొందుతోన్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా హైప్‌ను క్రియేట్ చేసుకుని హైలైట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో 'దేవర' ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో దీనిపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని ఏమాత్రం బ్రేకులు లేకుండా జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా శరవేగంగా పూర్తి చేయనున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ 'దేవర'ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి దాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే చిత్ర యూనిట్ ఏర్పాట్లు కూడా చేస్తోంది. ముఖ్యంగా బిజినెస్‌ను ప్రారంభించి.. చాలా వరకూ డీల్స్ కూడా క్లోజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఇది వాయిదా పడినట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ నెలలోనే వచ్చే అవకాశం ఉండడంతో ఈ చిత్ర విడుదలను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న 'దేవర' మూవీ వాయిదా పడినట్లు వార్తలు వైరల్ అవుతోన్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ దీనిపై స్పందించింది. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ రాసిన కథనానికి ట్విట్టర్ ఖాతాలో సమాధానం ఇచ్చింది. అందులో ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024లోనే విడుదల కాబోతుందని స్పష్టం చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











