Devara: 35 రోజులు అండర్‌ వాటర్‌లో షూటింగ్.. 'దేవర'టీంతో ‘యానిమల్’ డైరెక్టర్..

Devara: యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్- సన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. ఈ మూవీ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, గ్లింప్స్ లాగానే ట్రైలర్ కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంటలో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో తారక్‌ దేవర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ డే దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో దేవర టీం చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ చిట్ చాట్ కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్వూ ప్రొమోపై మీరు కూడా ఓ లూక్కేయండి.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 27న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, టీజర్, ట్రైలర్‌, సాంగ్స్‌కి ఆడియన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఏ వీడియో, ఫోటో అయినా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఇంటర్య్వూకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.

Devara Movie Team Janhvi Kapoor Saif Ali Khan director Koratala Siva and Jr NTR With Sandeep Reddy Vanga Special Interview

ఈ ప్రమోషన్స్ ఇంటర్వ్యూ ప్రోమోలో 'దేవర' మూవీ టీం ను సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి ఇంటర్య్వూలో చేశారు. ఈ ఇంటర్య్వూలో సందీప్ రెడ్డి వంగా యాంకర్ గా వ్యవహరించారు. డైరెక్టర్‌ కొరటాల శివ, జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ పాల్గొన్నారు. ఈ తరుణంలో సందీప్‌ రెడ్డి వంగా దేవర మూవీకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను మూవీ టీం చర్చించారు. మూవీలోని యాక్షన్‌ సీన్స్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ కరెక్టర్ డిజైన్ గురించి, జాన్వీ కపూర్‌ పర్ఫామెన్స్‌ గురించి ప్రశ్నించారు.

ముందుగా సందీప్ వంగా.. ఇది ఎలాంటి మూవీ అని ఎన్టీఆర్ ను ప్రశ్నించారు. 'దేవర మూవీ అనేది యాక్షన్‌ డ్రామా 'అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. 'రియల్ టీజర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ ఫైట్ సీన్ లో హాప్ మూన్.. ఆ చైన్ వల్ల పుల్ గా మారడం, ట్రైలర్ చేస్తే ఫియర్ ఉంది' అని సందీప్ రెడ్డి అనగానే దేవర టీం ఒక్కసారిగా నవ్వారు. ఆ తరువాత డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. 'జాన్వీ ఈజ్‌ ద బెస్ట్, తాను చాలా బాగా నటించింది' అని అప్రిషేట్ చేశారు.

35 రోజుల పాటు అండర్‌ వాటర్‌ లో షూటింగ్ చేసినట్టు, ఇక సముద్రంలో షార్క్‌తో చేసిన ఫైట్‌ సీన్‌ చాలా ఎక్స్ సైటింగ్ గా ఉంటాయని ఎన్టీఆర్‌ చెప్పగా.. 'దేవర'అందరి కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి పిచ్చెక్కిపోతారంటూ హీరోయిన్ జాన్వీ అన్నారు. ఇలా 'దేవర' సినిమా గురించి.. ఎన్టీఆర్‌, కొరటాల శివ స్వయంగా చెప్పడంతో మూవీపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నారు. దేవర మూవీ గురించి కొరటాల శివ,ఎన్టీఆర్‌, సైఫ్‌, జాన్వీ కపూర్ ఏం చెప్పారో తెలియాలంటే ఫుల్‌ ఇంటర్య్వూ వచ్చే వరకు ఆగల్సిందే.ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

More from Filmibeat

Read more about: janhvi kapoor saif ali khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X