Devara Overseas Business దేవర మూవీకి ముఖం ఛాటేస్తున్న బయ్యర్లు.. కారణం ఏమిటంటే?

ఆచార్య డిజాస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, RRR బ్లాక్‌బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం దేవర. డెవిల్ సినిమా ప్రమోషన్స్ సమయంలో నిర్మాత కల్యాణ్ రామ్ నందమూరి చెప్పిన విషయాలు సినిమాపై క్రేజ్‌ను భారీగా పెంచాయి. సమ్మర్ బరిలో ఏప్రిల్ నెలలో రిలీజ్‌కు సిద్దమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలకు ముందు బిజినెస్ వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. దేవర బిజినెస్ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Devara Overseas Business.. దేవర సినిమాకు ఊహించని రీతిలో థియేట్రికల్ రైట్స్ కొట్ | Telugu Filmibeat

అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేవర సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ గ్లింప్స్‌ను జనవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఓ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు మంచి స్పందనతోపాటు ట్రోల్స్ కూడా భారీగానే కనిపించాయి. ఎన్టీఆర్ కూడా ఈ ప్రోమో పోస్టర్‌ను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Devara Overseas Business: No buyer, Distributors ready for Jr NTR Movie: Here is the details

అయితే గ్లింప్స్ రిలీజ్‌కు ముందు దేవర బిజినెస్ చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకొన్న నిర్మాతలు భారీ రేటును డిస్టిబ్యూటర్లు, బయ్యర్ల ముందు ఉంచినట్టు ట్రేడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఎవరూ ఊహించని రీతిలో థియేట్రికల్ రైట్స్‌ను కోట్ చేస్తున్నట్టు తెలిసింది.

అయితే దేవర సినిమా ఓవర్సీస్ బిజినెస్ గురించి చర్చలు జరిగాయి. అయితే నిర్మాతలు చెప్పిన రేటు విన్న తర్వాత బయ్యర్లు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఆ రేంజ్‌లో బిజినెస్ కోట్ చేస్తే వారు పునరాలోచనలో పడ్డారు అనే విషయం ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Devara Overseas Business: No buyer, Distributors ready for Jr NTR Movie: Here is the details

ఇదిలా ఉండగా, దేవర సినిమాకు సంబంధించి ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ధరను భారీగా నిర్ణయించారు. దాదాపు 30 కోట్ల రూపాయలను కోట్ చేశారు. దాంతో బయ్యర్లు, డిస్టిబ్యూటర్లు ముఖం చాటేశారు. ఆ రేంజ్ ధరను పెట్టలేమని చెప్పారు. అయితే ఏ ఒక్క డిస్టిబ్యూటర్ కూడా నిర్మాతలు చెప్పిన ధరకు దరిదాపులో కూడా లేరు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Devara Overseas Business: No buyer, Distributors ready for Jr NTR Movie: Here is the details

అయితే దేవర గ్లింప్స్ తర్వాత బిజినెస్‌పై అంచనాలు పెరుగుతాయా? నిర్మాతలు డిమాండ్ చేస్తున్న ధరకు కొనడానికి బయ్యర్లు వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్టీఆర్ మూవీకి ఏ రేంజ్ బిజినెస్ జరుగుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, కొరటాల శివ ఆచార్య ఫలితం కూడా బయ్యర్లు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X