శ్రీకాంత్ ‘దేవరాయ’ శాటిలైట్స్ రైట్స్ అంతా?
హైదరాబాద్ : 100 సినిమాల హీరో శ్రీకాంత్ శ్రీకృష్ణదేవరాయలుగానూ, విలేజ్‌లో దొరబాబుగానూ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'దేవరాయ'. నానికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విధిష, మీనాక్షి దీక్షిత్‌లు కథానాయికలు. నానిగాడి సినిమా సమర్పణలో సన్‌రే ఇంటర్నేషనల్ సినిమా బేనర్‌పై కిరణ్ జక్కంశెట్టి, నానిక్రిష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చక్రి సంగీతాన్ని అందించారు.
శ్రీకాంత్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో శ్రీకృష్ణదేవరాయలుగా, దొరబాబుగా కనిపిస్తారు. రాజాధిరాజ శ్రీకృష్ణ దేవరాయ సంగీత సాహిత్యం సహా సకల కళల్లో సిద్ధహస్తుడు. ఆయన అంశతో పుట్టిన దొరబాబు పేకాట కళలో సిద్ధహస్తుడు. ఈచిత్రం శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడ పోయాయి. రూ. 1.8 కోట్లు థర్డ్ పార్టీ ఈ శాటిలైట్స్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వారి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో మీడియాతో నిర్మాత కిరణ్ మాట్లాడుతూ...'సోషియో ఫాంటసీ చిత్రంగా దేవరాయ రూపుదిద్దుకుంటుంది. మాకు చాలా సహకరిస్తూ ఈ చిత్రంలో నటించారు. ఒక హిట్ చేయాలనే పట్టుదలతో ఈచిత్రాన్ని నిర్మించా'మని తెలిపారు.
దర్శకుడునాని క్రిష్ట మాట్లాడుతూ...'చాలామంది ఈ సినిమాకు శ్రీకృష్ణదేవరాయలు పేరు వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. మనం పిల్లలకు కథలు చెప్పేటప్పుడు అనగనగా ఓ కథ అంటాం. ఆ కథలోని రాజు ఎవరో ఒకరు తీసుకోవాలి గనుక మనకు తెలిసిన దేవరాయలు తీసుకున్నాం. అంతకుమించి ఆయన్ను విమర్శించేది ఏదీ లేదు అన్నారు.


Click it and Unblock the Notifications











