నాన్న చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి: అనుష్క

దేవసేన పాత్రతో ఒక్కసారిగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలన్నిటిలో పాపులర్ అయిపోయిన అనుష్క ఈ మధ్య మామూలు సినిమాల్లో, రెగ్యులర్ క్యారెక్టర్లలో కనిపించటానికి ఇష్టపడటం లేదు. అరుంధతి, దేవసేన లాంటి పాత్రలు అనుష్క కి హీరో స్థాయి మార్కెట్ కట్టబెట్టాయి. ఇప్పుడు ఆమె మళ్ళీ జస్ట్ హీరోయిన్ గా కనిపించటానికి ఇష్టపడటం లేదు. తాను ఏ తరహా పాత్రలని ఇష్టపడుతోందో ఇండైరెక్ట్ గానే చెప్పేసింది స్వీటి శెట్టి.

మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుంది

మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుంది

మామూలుగా రెండు పాటల్లో, కొన్ని రొమాంటిక్ సీన్లలో కనిపించే పాత్రలకన్నా, నటనా పరంగా సంతృప్తిని ఇచ్చే పాత్రలకే తన ఓటు అన్నట్టుగా, మళయాళ సినిమాలలో ఉండే గొప్ప తనం గురించి లెక్చర్ ఇచ్చింది. అంతే కాదు వాళ్ళ నాన్నగారు మళయాళ సినిమా గురించి చెప్పిన మాటలని కూడా మళ్ళీ ఓసారి గుర్తు చేసుకుంది...

సినిమాల మీద ఆసక్తి ఉండేది

సినిమాల మీద ఆసక్తి ఉండేది

"కొత్త విషయాలను ప్రయత్నించే ప్రతిసారీ ఉత్సుకత ఉంటుంది. దానికి తోడు ఎక్కడో భయాందోళనలు కూడా చోటుచేసుకుంటాయి'' అని చెప్పింది అనుష్క. ‘‘నాకు స్కూల్‌డేస్‌ నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. మా నాన్న నాకు మలయాళ సినిమాల గురించి చాలా చెప్పేవారు. ‘భారతీయ చలనచిత్ర సీమ తలెత్తుకునేలా చేయగలదు మలయాళ సినిమా' అని నాన్న చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి.

మంచి స్క్రిప్ట్ ఉందనిపించినా నటిస్తాను

మంచి స్క్రిప్ట్ ఉందనిపించినా నటిస్తాను

అప్పట్లో మమ్ముట్టి, శోభన నటించిన సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లం. నేను సినిమాల్లోకి వచ్చాక మల్లువుడ్‌లో పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌లు వస్తాయని అర్థమైంది. కేరళ అభిమానులు ప్యాషన్‌ ఉన్న వారు. సినిమాల పట్ల మంచి అవగాహన ఉన్నవారు. అలాంటి మలబారు తీరంలో నేను అడుగుపెట్టాల్సి వస్తే, ఆ ప్రాజెక్ట్‌లో.. మంచి దర్శకుడు, మంచి హీరో.. ఉన్నారా లేదా? అని ఆరా తీస్తాను. ఒకవేళ వీటిలో ఏది లేకపోయినా.. కనీసం మంచి స్క్రిప్ట్ ఉందనిపించినా నటిస్తాను'' అని చెప్పింది స్వీటీ.

అర్థం అయ్యింది కదా

అర్థం అయ్యింది కదా

సో ఇప్పుడు అనుష్క ఫోకస్, అభిరుచి ఎటువైపు మొగ్గుతున్నాయో అర్థం అయ్యింది కదా... మన దగ్గర కూడా అలాంటి పాత్రలుంటేనే అనుష్కని సంప్రదించాలన్న మాట. నిజమే దాదాపు భారత దేశాన్ని కూడా దాటిన సినిమాలో నటించాక ఇంక డబ్బుమీదా, రెగ్యులర్ సినిమా మీదా ఒక రకమైన విరక్తి వచ్చేస్తుంది. దాదాపు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ లాంటి సినిమా చేసేసాక ఇప్పుడు అనుష్క అలా మాట్లాడటం లో తప్పేలేదు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X