ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘దేవస్థానం’ మూవీ

By Bojja Kumar

హైదరాబాద్: జనార్ధన మహర్షి 'దేవస్థానం' చిత్రాన్ని దేశ, విదేశీయులు చూడబోతున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ అచ్చ తెలుగు సినిమాని శక్తివంతమైన కథాంశంతో జనార్ధన మహర్షి తెరకెక్కించారు. ప్రపంచ తెలుగు మహా సభల్లో ఈ నెల 28న ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు.

అది మాత్రమే కాదు..'వెన్నముద్దలు, గుడి, పంచామృతం, కవిగానే కన్నుమూస్తా, నాకు నేను రాసుకున్న ప్రేమలేఖ' పేరుతో మహర్షి రాసిన పుస్తకాలను కూడా ఈ సభల్లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వీటిలో 'వెన్నముద్దలు' ఎనిమిదో ముద్రకావడం విశేషం.

ఈ సందర్భంగా రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ 'ఈ నెల 28న దేవస్థానం చిత్రం ప్రదర్శించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగువారు ఈ చిత్రాన్ని చూసి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగాగా కోరుకుంటున్నాను.

ఈ సినిమాతో పాటు తెలుగు మహా సభల్లో నా పుస్తకాలకు కూడా స్థానం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు. ప్రస్తుతం జనార్ధన మహర్షి 'పవిత్ర' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీయ కథానాయికగా ఓ బలమైన కథాంశంతో మహర్షి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X