‘దేవదాస్ స్టైల్ మార్చాడు’

By Bojja Kumar

హైదరాబాద్: దేవదాసు, పార్వతి ప్రేమకథ గురించి అందరికీ తెలిసిందే. దేవదాసు క్యారెక్టర్‍‌ను ఇన్స్ఫిరేషన్‌గా తీసుకుని అదే టైటిల్‌తో తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మరో చిత్రం తెలుగు తెరపై ఆడబోతోంది. యంగ్ హీరో తనిష్ ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్నాడు.

శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో వి.ఎస్.రామిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం పేరు 'దేవదాస్ స్టైల్ మార్చాడు'. తనీష్ సరసన ఈచిత్రంలో చాందినీ హీరోయిన్‍‌గా నటిస్తోంది. తనీష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ 7న(శుక్రవారం) ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో జరిగింది.

ముహూర్త సన్నివేశంపై రామకృష్ణారెడ్డి క్లాప్ ఇవ్వగా ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర కథానాయకుడు తనీష్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించారని, తన గత చిత్రాలకు పోలిక లేకుండా ఈ సినిమా లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

తనీష్ గత చిత్రాలు ఓ మోస్తరుగా ఆడుతూ ఫర్వాలేదనిపించాయి. ఈ నేపథ్యంలో తనీష్‌తో తక్కువ బడ్జెట్ సినిమాలు చేయడానికి చిన్న నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. పూర్తి హాస్యభరితంగా రూపొందుతున్న 'దేవదాస్ స్టైల్ మార్చాడు' చిత్రానికి సంగీతం: గణ, పాటలు: జయసూర్య, రమేష్, సదాచంద్ర, కెమెరా: జి.ఎస్.చక్రవర్తిరెడ్డి, నిర్మాత: వి.ఎస్.రామిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X