దేవిశ్రీప్రసాద్ కు రామ్ చరణ్ గోల్డెన్ ఛాన్స్
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కీ మెగా క్యాంప్ కి మంచి రిలేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ 'జంజీర్'రీమేక్ చేస్తున్న సందర్బంగా దేవిని తన చిత్రానికి రికమెండ్ చేసారని సమాచారం. వెంటనే దర్సక, నిర్మాతలు ఓకే చేసి దేవినే తమ చిత్రానికి సంగీతం అందించాలని సంప్రదించారని బాలీవుడ్ మీడియా అంటోంది. అందులోనూ తన ఐటం సాంగ్స్ తో ఇప్పటికే బాలీవుడ్ లో దేవి పాపులర్ అయ్యారు.
ఆర్య 2 కోసం దేవి ఇచ్చిన ఐటం ట్యూన్ 'రింగ రింగ..' పాట సల్మాన్‌ఖాన్ నటించిన 'రెడీ'లో 'దింక చిక..' పేరిట హిందీలో అదరకొట్టింది. అలాగే సోనూసూద్ నటిస్తున్న హిందీ చిత్రం 'మాగ్జిమమ్'లో 'అ అంటే అమలాపురం..' పాటను ఉపయోగించారు. తెలుగులో హిట్ అయిన ఈ రెండు ప్రత్యేక పాటలు ఉత్తరాదివారిని కూడా ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ పాటలే దేవిని బాలీవుడ్‌లో బాగా పాపులర్ చేశాయి.
ఇక ఇప్పుడు స్ట్రైయిట్ గా పూర్తి పాటలతో 'జంజీర్'లో అధరకొడతానంటున్నాడు. ఈ సినిమా హిట్టైతే వరసగా పెద్ద హీరోల నుంచి,సంస్ధల నుంచి ఆపర్స్ వస్తాయనటంతో సందేహం లేదు. అందులోనూ సౌత్ సినిమా గాలులు బాలీవుడ్ లో వీస్తున్న సమయమిది. ఇక అమితాబ్‌బచ్చన్ నటించిన 'జంజీర్'కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం కావటంతో మంచి క్రేజ్ ఉండబోతోంది.


Click it and Unblock the Notifications











