దేవిశ్రీ ప్రసాద్ హీరోగా లాంచింగ్
మ్యూజిక్ డైరక్టర్ గా ఒక వెలుగు వెలిగిన దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్యన డౌన్ అయ్యారనే చెప్పాలి. రీసేంట్ గా ఊసరవెల్లి చిత్రం తప్ప అతని చేతిలో కొత్త సినిమాలు లేవు. ఈ నేపధ్యంలో అతను పూర్తిగా హీరో అవుదామనే దృష్టి పెట్టాడని తెలుస్తోంది. తెలుగు,తమిళ భాషల్లో పేరొందిన ఓ నిర్మాత అతనితో సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నాడని చెన్నై వార్త. దాంతో దేవి తనను డైరక్ట్ చేయదగ్గ ల్దర్శకుడు కోసం అన్వేషణ జరుపుతున్నారు. అలాగే తన మొదటి సినిమా ఓ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఉండాలని దేవి బావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్.ఎస్.రాజు ఆ ధైర్యం చేద్దామని ఊగారు కాని తన కొడుకునే సీన్ లోకి తేవాల్సిన అవసరం రావటంతో సైలెంట్ అయ్యిపోయారు.
ఇక పెద్ద దర్శకులు ఎవరూ తనను హీరోగా పెట్టి సినిమా తీయటానికి ఆసక్తి చూపరు కాబట్టి కొత్త దర్సకులనే ఎంకరేజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే తన చిత్రానికి సంభందించి సంగీతం ప్రీ గా ఇస్తానని హామీ ఇచ్చి మరీ నిర్మాతలను ఎట్రాక్ట్ చేస్తున్నట్లు వినికిడి. అందుకే హీరోలు సైతం అతన్ని దూరం పెడుతున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క తమన్ దూసుకుపోవటం కూడా దేవిశ్రీ ప్రసాద్ కి మైనస్ గా మారింది.


Click it and Unblock the Notifications











