‘అత్తారింటికి దారేది’పాటల పై దేవిశ్రీప్రసాద్ విశ్లేషణ (ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ వింటున్నా 'అత్తారింటికి దారేది' పాటలే. ఈ చిత్రంలో పాటలు ఇప్పుడు యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ పాటలు ఇంతలా జనంలోకి దూసుకువెళ్లటానికి ఒక కారణం పవన్ కళ్యాణ్ అయితే మరో కారణం మ్యూజికల్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ అనే చెప్పాలి.

పవన్‌కల్యాణ్ సినిమాల్లో పాటలు బావుంటాయి. అలాగే త్రివిక్రమ్‌క్కూడా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఇక వీరిద్దరికీ దేవిశ్రీప్రసాద్ జత కలిస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ 'జల్సా' పాటలు ఈ ముగ్గురి కాంబినేషన్‌లోని మజా ఏంటో చూపించాయి. ఇప్పుడేమో 'అత్తారింటికి దారేది' పాటలు కూడా ఓ రేంజ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

'ఆరడుగుల బుల్లెట్టు' అనే పాట అభిమానులకో పెద్ద కిక్కు. ఈ పాటలో శ్రీమణి రాసిన సాహిత్యానికి మంచి అప్లాజే వస్తోంది. అలాగే రామజోగయ్యశాస్త్రి రాసిన 'బాపు గారి బొమ్మో', 'దేవ దేవం', 'కిర్రాకు' పాటలు కిర్రెక్కించేలా ఉన్నాయి. ఈ పాటల్లో రామజోగయ్యశాస్త్రి ఎక్స్‌ప్రెషన్స్ చాలా లవ్లీగా ఉన్నాయంటున్నారు. ఆడియో సక్సెస్‌తో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.

నిర్మాత ఈ చిత్రం పాటల గురించి మాట్లాడుతూ..."ఆడియో రిలీజ్ అయిన రోజు నుంచే అద్భుతమైన స్పందన వచ్చి రికార్డులు సృష్టించింది. ఎక్కడ విన్నా 'అత్తారింటికి దారేది' పాటలే వినిపిస్తున్నాయి. ఈ క్రెడిట్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కూ, గేయ రచయితలకూ దక్కుతుంది. అలాగే ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ అనూహ్యం. సినిమా సైతం అదే ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.

ఈ నేపధ్యంలో పాటల గురించి దేవి మాటల్లో... స్లైడ్ షో లో..

‘ఆరడుగుల బుల్లెట్'

‘ఆరడుగుల బుల్లెట్'

‘ఆరడుగుల బుల్లెట్' అనే కాయినింగ్ త్రివిక్రమ్ కథ చెబుతున్నప్పుడే తట్టింది. దాన్ని ట్యూన్‌గా పాడితే త్రివిక్రమ్‌గారికి వెంటనే నచ్చేసింది అని దేవి చెప్పారు. హీరో కేరెక్టరైజేషన్‌ని ఆవిష్కరించే ‘ఆరడుగుల బుల్లెట్'లాంటి బరువైన పాటను శ్రీమణి అనే కొత్త రచయితతో రాయించడం సాహసం అనుకోలేదని దేవీ చెప్తూ.... శ్రీమణి హైలీ టాలెంటెడ్. మాకేం కావాలో అది ఇచ్చాడు. ‘100%' లవ్' సినిమా సమయంలో దర్శకుడు సుకుమార్ తనని నాకు పరిచయం చేశారు. ‘అహో బాలూ', ‘దటీజ్ మహాలక్ష్మి' పాటలు తనే రాశాడు అన్నారు.

‘అత్తలేని కోడలుత్తమురాలు'

‘అత్తలేని కోడలుత్తమురాలు'

‘నిన్ను చూడగానే' పాటలో ‘అత్తలేని కోడలుత్తమురాలు' అనే పాత పాటను వాడాలని ఎందుకనిపించిందో చెప్తూ... అది త్రివిక్రమ్ ఆలోచనే. సినిమా చూస్తే, దాన్ని ఎందుకు ఉపయోగించామో తెలుస్తుంది. తప్పకుండా ఆ ప్రయోగం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. సినిమా విజయంలో దాని భాగస్వామ్యం ఉంటుందన్నంత ధీమాగా చెప్పారు.

పాట అందుకే రాసా

పాట అందుకే రాసా

అన్నీ స్పాంటేనియస్సే. కథ వింటున్నప్పుడే టకటకా ట్యూన్లు పుట్టుకొచ్చేస్తుంటాయి. దానికి డమ్మీ లిరిక్స్ ఏవో అనుకుంటూ ఉంటాను. ‘అత్తారింటికి దారేది' కథను స్పెయిన్‌లోని బార్సిలోనాలో విన్నాను. ఓ సందర్భానికి ఏం పాట చేద్దామా అని ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, సడన్‌గా ‘నిన్ను చూడగానే'పాట పుట్టింది. దీన్ని సరదాగా త్రివిక్రమ్ గారికి వినిపించి ‘‘మన సినిమాకు పని చేయదు లెండి'' అన్నాను. ‘‘లేదు లేదు... ఇది సెకండాఫ్‌లో పనికొస్తుంది. ముందు మొత్తం పాట రాసేయండి'' అని చెప్పారు. దాంతో నేనే రాసేయాల్సి వచ్చింది. ‘జులాయి'లో ‘ఓ మధు' పాటను కూడా ఇలాగే నాతో రాయించారు.

అందుకే ఆ పాటకు అంత క్రేజ్...

అందుకే ఆ పాటకు అంత క్రేజ్...

‘నిన్ను చూడగానే' చాలా లో పిచ్‌లో, మంద్రంగా ఈ పాటను పాడటానికి కారణం చెప్తూ... అలాంటి యాటిట్యూడ్‌తో పాడ్డం వల్లనే ఆ పాటకు ఇంత క్రేజొచ్చింది. అయినా కల్యాణ్‌గారి మీద ఏ పాట అయినా బావుంటుంది అన్నారు దేవి. ఇప్పుడా పాట యూత్ పెదాలపై నానుతోంది.

‘దేవదేవం భజే' ట్యూన్ గురించి ....

‘దేవదేవం భజే' ట్యూన్ గురించి ....

సినిమాలో ఒక డాన్స్ క్లాస్ సీన్ కోసం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాడిన ‘దేవ దేవం' అనే అన్నమాచార్య కీర్తన వాడదామా అన్నారు త్రివిక్రమ్. మొత్తం వాడేకన్నా, మొదటి రెండు లైన్లు ఉపయోగించి అక్కడ్నుంచీ కొత్త పాట సృష్టిస్తా అని చెప్పాను. రాత్రికి రాత్రి నాకిష్టమైన హిందోళ రాగంలో ఆ పాట చేసి వినిపిస్తే త్రివిక్రమ్ షాకయ్యారు. ‘కంటిన్యూస్‌గా 20 సార్లు ఈ పాట విన్నాను. ఇంత అద్భుతంగా ఉంది' అని మెచ్చుకున్నారాయన. ఆ కాంప్లిమెంట్‌ని జీవితంలో మర్చిపోలేను. ఆ పాటను రీటా, పాలక్కాడ్ శ్రీరామ్ పాడారు.

ఆయన వేసిన పునాది వల్లనే ...

ఆయన వేసిన పునాది వల్లనే ...

ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు పాడిన ‘దేవదేవం భజే' పాటను పాడటానికి రీటా మొదట చాలా భయపడింది. ఆరు రోజులు ప్రాక్టీస్ చేసి అద్భుతంగా పాడింది. పాలక్కాడ్ శ్రీరామ్ వయొలినిస్ట్. ఆయన వాయిస్ ఈ పాటకు కరెక్ట్ అని పాడించాను. ఈ పాటను నాకు క్లాసికల్ మ్యూజిక్ నేర్పించిన నా గురువు మేండలిన్ శ్రీనివాస్‌కి అంకితమివ్వాలి. ఆయన వేసిన పునాది వల్లనే ఇలాంటి పాట చేయగలిగాను. అసలు ఇలాంటి ట్రెండ్‌లో ఈ తరహా పాట చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమే.

‘ఓల్డ్‌మాంక్ రమ్మో'...

‘ఓల్డ్‌మాంక్ రమ్మో'...

‘బాపుగారి బొమ్మో' పాట పొయిటిగ్గా ఉంటుంది. అలాంటి పాటలో ‘ఓల్డ్‌మాంక్ రమ్మో' అని వాడడం అసందర్భంగా అన్న విషయం ప్రస్తావించినప్పుడు... ఆ సిట్యుయేషన్‌కి అది కరెక్ట్ అనిపించింది. రేపు సినిమాలో చూస్తే మీరూ ఎంజాయ్ చేస్తారు. రామజోగయ్యశాస్త్రి అద్భుతంగా ఈ పాట రాశారు అంటూ చెప్పుకొచ్చారు.

‘కిర్రాకు' పద ప్రయోగం...

‘కిర్రాకు' పద ప్రయోగం...

ఓ పాటలో ‘కిర్రాకు' పదప్రయోగం చేయించారు . దాని గురించి చెప్తూ... హైదరాబాద్‌లో చాలా తరచుగా ‘కిర్రాకు' అని పదం వాడుతుంటారు. ‘కిర్రాకు' అంటే క్రాక్ అన్న మాట. ఎఫ్‌ఎమ్ రేడియోల్లోనూ ఈ పదం పాపులరే. త్రివిక్రమ్‌గారికి ఓసారి దీని గురించి చెబితే, సరిగ్గా ఈ పాట సమయంలో గుర్తు చేశారు.

‘టైమ్ టూ పార్టీ'

‘టైమ్ టూ పార్టీ'

ఈ పాటను పాడిన మాల్గాడి శుభ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు డెరైక్ట్ చేసిన ‘దాదర్ ఎక్స్‌ప్రెస్' ద్వారానే ఆమె సింగర్‌గా పరిచయమయ్యారు. ‘గోల్డ్‌స్పాట్' ప్రకటనలో ఆమె గొంతు విని కోటిగారికి చెప్పారు మా డాడీ. ఆ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది. ఆ పాటను ఆమే పాడారు. ఏఆర్ రెహమాన్ కీబోర్డ్ వాయించారు. నేను ఆవిణ్ణి ‘బాబీ' అని పిలుస్తుంటాను. వెరీ టాలెంటెడ్. ‘తులసి', ‘జులాయి' సినిమాల్లో కూడా ఆమెతో పాడించాను. ఇక ఈ పాటను 2, 3 రకాల మాడ్యులేషన్స్‌తో పాడారు.

పవన్‌ తో పాడించిన పాట గురించి...

పవన్‌ తో పాడించిన పాట గురించి...

ఆయనతో సరదాగా ఓ బిట్ సాంగ్ పాడించాం. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేద్దామని, దాన్ని ఆల్బమ్‌లో చేర్చలేదు. పవన్ పాడిన ఆ పాట ఇలా సాగుతుంది.... ‘కాటం రాయుడా ...కదిరి నరసింహుడా '. శబ్దాలయాలలో తాజాగా ఈ పాటను పవన్ పాడగా రికార్డు చేసారు. దీన్ని ప్రమేషనల్ సాంగ్ గా విడుదల చేసే అవకాసం ఉంది. సినిమా చివర్లో ఈ పాట ఎండ్ టైటిల్స్ వద్ద వస్తుందని అంటున్నారు. పంజాలో ...బ్రహ్మానందం,పవన్ మధ్య పాటలా ఇది వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ పాట వీడియో విడుదల చేస్తారని చెప్తున్నారు.

పవన్ గురించి...

పవన్ గురించి...

కల్యాణ్‌గారిలో ఉన్న స్పెషాల్టీ ఏంటంటే - ఎలాంటి మ్యూజిక్‌కైనా ఆయన సెట్ అయిపోతారు. ఆయనకున్న ఫాలోయింగ్, చిత్రమైన బాడీ లాంగ్వేజ్ వల్లనే అది సాధ్యమయ్యిందేమో. పవన్‌కల్యాణ్‌తో మీరు చేసిన ‘జల్సా', ‘గబ్బర్‌సింగ్' మ్యూజికల్ హిట్స్.

ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల

ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల

పవన్‌కల్యాణ్ హీరో గా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సమంత, ప్రణీత నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. బుధవారంతో తన పాత్ర డబ్బింగ్‌ను పవన్‌కల్యాణ్ పూర్తి చేశారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. సెన్సార్ పనుల్ని జరిపేందుకు నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X