చిరంజీవి ప్రయోగాల గురించి...దేవిశ్రీ ప్రసాద్
కొత్త ప్రయోగాలు చేయడానికి చిరంజీవి ఎప్పుడూ వెనకాడరన్న నా నమ్మకం నిజమైంది. రికార్డింగ్ స్టూడియోలో నేను ఎలా చెబితే అలాగే చెప్పేవారు. 'శంకర్ దాదా జిందాబాద్'లోనూ జగదేక వీరుడికి.. అనే పాటలోనూ ఆయన గళం వినిపిస్తుంది అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిరంజీవితో అనుభవన్ని గురించి చెబుతూ. అలాగే తనకి ఓ కోరిక ఉందిని అది చిరంజీవితో పూర్తి నిడివి పాటను పాడించాలని. ఇంకా ఆ అవకాశం రాలేదు చెప్తున్నారు. ఇక చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీయస్'లో చైల చైలా చైలా చైలా..అంటూ ఓ పాట వస్తుంది. నేనే రాశాను. మధ్య మధ్యలో కొన్ని సంభాషణల్ని స్వరబద్ధంగా పలకాలి. అవి చిరంజీవి చెబితేనే బాగుంటుందీ అనుకున్నాను. వెళ్లి అడిగాను. 'ఓ.యస్. చేసేద్దాం' అని అన్నారు అంటూ ఆ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. ఇక దేవి తాజాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా చేయనున్న చిత్రానికి సంగీతం అందించటానికి కమిట్ అయ్యారు.ఆ చిత్రాన్ని ధరణి డైరక్ట్ చేస్తారు.


Click it and Unblock the Notifications











