రాంచరణ్ డాన్స్ టెర్రిఫిక్.. దేవిశ్రీ హింట్ ఇచ్చాడుగా!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. సాఫ్ట్ టైటిల్ పెట్టి రాంచరణ్ ని ఊర మాస్ గా చూపించబోతున్నాడు బోయపాటి శ్రీను. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. నెలకన్నా తక్కువ సమయం ఉండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

డిసెంబర్ 17 సాయంత్రం 4 గంటలకు ఈ చిత్ర సెకండ్ సాంగ్ ని విడుదల చేయనున్నట్లు ఇది వవరకే ప్రకటించారు. ఈ సాంగ్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మెగా అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందించాడు. తస్సాదియ్యా అనే పాట వింటూ చిందులేయడానికి సిద్ధంగా ఉండండి. బోయపాటి ఈ పాటని అద్భుతంగా చిత్రీకరించారు. రాంచరణ్, కైరా అద్వానీ అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేయబోతున్నారు అంటూ దేవిశ్రీ ట్వీట్ చేశాడు.

Devi Sri Prasad about Ram Charan and Kiara Advani dance

జనవరి 11న విజయ విధేయ రామ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ కీలక పాత్రల్లో నటించారు. రంగస్థలం తరువాత చరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X