సంతకం పెట్టాక చెబుతా... దేవిశ్రీ ప్రసాద్

By Srikanya

ఇప్పుడు మళ్లీ ఓ మంచి అవకాశం వచ్చింది. చేయాలా? వద్దా అని ఆలోచిస్తున్నా. సంతకం పెట్టిన తరవాత ఆ కబురు చెబుతా'' అంటున్నారు దేవిశ్రీ.ప్రసాద్. చిన్న వయస్సులోనే స్టార్ మ్యూజిక్ డైరక్టర్ గా ఎదిగిన దేవికి ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అయితే ఆల్రెడీ తెలుగు,తమిళంలో బిజీగా ఉండటంతో ఏదీ కమిట్ కావటం లేదు. ఆ విషయం చెప్తూ పై విధంగా స్పందించారు. బాలీవుడ్ ఆఫర్స్ రావటానికి కారణం హిందీలో ఈ మధ్య దేవి ఇచ్చిన ట్యూన్ సూపర్ హిట్ కావటం. సల్మాన్‌ఖాన్‌ 'రెడీ' సినిమా కోసం దేవి కూర్చిన 'ఢింకచక.. ఢింకచక' సూపర్ హిట్ అవటం అతనికి బాలీవుడ్ కాలింగ్ కు కారణమైంది.

అంతేగాక 'రెడీ' . సినిమా పాటల ఫంక్షన్ లో దేవిశ్రీ పోగ్రాం కూడా ఇచ్చారు. దాంతో బాలీవుడ్‌ దర్శకుల దృష్టి ఈ యువ సంగీత దర్సకుడు మీద పడింది. 'ఢింకచక..' పాట తరవాత దేవిశ్రీకి ముంబై నుంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్‌ ప్రవేశంపై కంగారు పడదలుచుకోలేదు. ఈ విషయం చెప్తూ...'' రెడీ పాటకు ముందు నుంచి కూడా కొంతమంది బాలీవుడ్‌ దర్శకులు నన్ను సంప్రదించారు. అయితే హీరో, నిర్మాణ సంస్థ... ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. పైగా తెలుగు, తమిళ చిత్రాలతో తీరిక దొరకలేదు. ఓ హిందీ సినిమా చేయాలనే కోరిక నాకూ ఉంది అన్నారు. అంటే త్వరలనే దేవి పూర్తి స్దాయి బాలీవుడ్ సినిమాకు పనిచేస్తారన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X