అన్నకంటే ముందే రహస్యంగా దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడి వివాహం(ఫోటోలు)

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ ఇంట పెళ్లి భాజాలు మ్రోగాయి. అయితే ఈ భాజాల శబ్దం చాలా ఆలస్యంగా బయటి ప్రపంచానికి వినిపించాయి. మీడియాలో ఈ విషయంలో అనవసర రచ్చ జరుగక ముందే దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా ఈ విషయం ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.

అయితే ఇది దేవిశ్రీ ప్రసాద్ వివాహానికి సంబంధించిన న్యూస్ కాదు... ఆయన తమ్ముడు సాగర్ వివాహానికి సంబంధించిన వార్త. డాక్టర్ మౌనికతో సాగర్ వివాహం జరిగింది. అన్నయ్యతో కలిసి గత కొన్నేళ్లుగా సినిమా సంగీత ప్రపంచంలో రాణిస్తూ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్... డాక్టర్ మౌనికను పెళ్లాడారు.

జూన్ 19న జరిగిన వివాహం, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన దేవిశ్రీ

జూన్ 19న జరిగిన వివాహం, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన దేవిశ్రీ

సాగర్-మౌనిక వివాహం జూన్ 19న జరిగింది. అయితే ఈ వేడుక రహస్యంగా జరిగింది. సినీ రంగానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదు. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఎట్టకేలకు దేవిశ్రీ ప్రసాద్ ఈ విషయాన్ని తనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కొత్త దంపతులను విష్ చేసిన దేవిశ్రీ

కొత్త దంపతులను విష్ చేసిన దేవిశ్రీ

‘నా సోదరుడు సాగర్ వివాహం డాక్టర్ మౌనికతో జూన్ 19న జరిగింది. ఇదే రోజు మా పేరెంట్స్ పెళ్లి రోజు కూడా. ఈ వేడుకకు క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరయ్యారు. మౌనికను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. ఈ నూతన దంపతులకు మీ బ్లెస్సింగ్స్ కావాలి... అని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

నీ పెళ్లి ఎప్పుడూ అంటూ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం

నీ పెళ్లి ఎప్పుడూ అంటూ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం

దేవిశ్రీ ప్రసాద్ చేసిన ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ నూతన దంపతులను ఆశీర్వదించడంతో పాటు... నీ పెళ్లి ఎప్పుడు అన్నా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. త్వరగా మీరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటూ తమ మనసులోని మాటను నిర్మొహమాటంగా బయట పెట్టారు.

మరి దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ఎప్పుడు?

మరి దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ఎప్పుడు?

దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. గతంలో ఆయన ఓ సినీ తారను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ఒకరిగా ఉన్న ఈ టాప్ మ్యూజీషియన్... తన పెళ్లికి భాజా ఎప్పుడు మ్రోగిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X