For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబు మీ న్యూ లుక్ మైండ్ బ్లాక్.. మహేష్‌పై దేవీ శ్రీ ప్రసాద్ కామెంట్స్

    |

    మహేష్ బాబు చాలా రోజుల తరువాత షూటింగ్ సెట్‌లోకి అడుగుపెట్టాడు. దాదాపు ఐదారు నెలల తరువాత ఇంటి నుంచి బయటకు వచ్చి ఓ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఓ యాడ్ షూటింగ్ కోసం మేకప్ వేసుకున్న మహేష్ బాబు న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో కుంపటిని పెట్టింది. ఒక వేళ అదే లుక్ సర్కారు వారి పాట సినిమా కోసం ఉంటే రికార్డుల బద్దలే అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక మహేష్ హెయిర్ స్టైల్‌కి ఫిదా కానివార్వెవరూ ఉండరు.

    మహేష్ బాబు ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. లాక్‌డౌన్, కరోనా కాలంలో మొదటిసారిగా మహేష్ బాబు షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే ఈ యాడ్ షూటింగ్‌కు సంబంధించిన ఓ స్టిల్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఇక మహేష్ న్యూ లుక్కును చూసి ఫ్యాన్సే కాదు సినీ ప్రేక్షకులందరూ షాక్ అవుతున్నారు. లాక్ డౌన్‌లో మహేష్ బాబు మరింత వయసు తగ్గించుకున్నాడని, అందాన్ని పెంచుకున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    Devi Sri Prasad Comments On Mahesh Babu New Look

    మహేష్ బాబు న్యూ లుక్‌పై రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కామెంట్స్ చేశాడు. ఆయన తన స్టైల్లోనే న్యూ లుక్‌పై మైండ్ బ్లాక్ రివ్యూ ఇచ్చాడు. సూపర్ స్టార్...సూపర్ సార్.. మహేష్ బాబు సర్ ఆన్ ఫైర్.. మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్.. మైండ్ బ్లా‌కు.. బాబు మీ న్యూ లుక్ మైండ్ బ్లాకు అంటూ ట్వీట్ చేశాడు. ఇక దేవీ చేసిన ట్వీట్‌కు మహేష్ ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ రిట్వీట్‌లు చేస్తున్నారు.

    English summary
    Devi Sri Prasad Comments On Mahesh Babu New Look, Mahesh Babu Entry Into Set For An Ad Shoot, SuperStar urstrulymahesh is Back on sets for an Ad shoot !!! The ad shoot will take place today and tomorrow in Hyderabad!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X